వంటిప్స్

3 Jul, 2016 22:40 IST|Sakshi
వంటిప్స్

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.అప్పడాలు వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగదు.మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.

బంగాళదుంపల మధ్యలో కొన్ని వెల్లుల్లి రేకలు ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.బెండకాయలు తాజాగా, ముదిరిపోకుండా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది. దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.

 

 

మరిన్ని వార్తలు