వేసవిలో కూల్‌గా ప్యాక్స్...

16 May, 2016 23:25 IST|Sakshi
వేసవిలో కూల్‌గా ప్యాక్స్...

 బ్యూటిప్స్

ఎండ వేడిమి, దుమ్ము.. చర్మపు రంగును, తాజాదనాన్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మం నిగారింపు కోల్పోకుండా, వేడి నుంచి ఉపశమనం పొందాలంటే...

     
పుదీనా ప్యాక్
: ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తర్వాత టీ స్పూన్ పుదీనా ఆకుల పేస్ట్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.  బాదం నూనెలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం మీద, కళ్లకింద, మెడ, గొంతు, చేతులపై మృదువుగా రాయండి. అరగంట తర్వాత  గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.50 గ్రాముల ఎర్రకందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బాలి. దీంట్లో పచ్చిపాలు, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మేనికంతా పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.  దోసకాయ గుజ్జులో టేబుల్ స్పూన్ పంచదార కలిపి, ఫ్రిజ్‌లో చల్లబడేవరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.

మరిన్ని వార్తలు