రాగిజావ... ఆరోగ్యానికి దోవ 

18 Apr, 2019 00:00 IST|Sakshi

వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిలో రాగిజావ చాలా ఆరోగ్యకరం. రాగిజావను రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...

∙రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

∙వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది.

∙రాగి పిండిలో విటమిన్‌–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోబాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.

∙బరువు తగ్గాలనుకునేవారు రాగులను జావ రూపంలోనే కాదు, సంగటిగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 

∙రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.

∙దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

వానొస్తే వాపస్‌

మంచిగైంది

ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి

స్కూటీతో సేద్యానికి...

నన్నడగొద్దు ప్లీజ్‌ 

చ. మీ. చోటులోనే నిలువు తోట!

ఫ్యూచర్‌ ఫుడ్స్‌!

2 ఎకరాల కన్నా 3 గేదెలు మిన్న!

నేను ఇలా చెయ్యడం సముచితమేనా? 

సాహో సగ్గుబియ్యమా...

సమాధిలో వెలుగు

అలంకరణ

సద్భావన

మీ ఆరోగ్యాన్ని... దుస్తులే చెబుతాయి!

పలువరస సరిచేసుకోవడం కేవలం అందం కోసమేనా?

హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?

ప్రపంచానికి అప్లికేషన్‌

స్వర్గవాసి ఆరాధన

వ్యక్తీకరణ

మా అమ్మ పులి

వీస్వావా షింబోర్‌స్కా (గ్రేట్‌ రైటర్‌)

కొడుకును దిద్దిన తండ్రి

ఒకప్పటి మన ఆటలు

నటించాల్సిన దుఃఖానికి ప్రతిఫలం

ఒక జీవితం బతికిపోయింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..