తిక్క కుదిరింది

15 Sep, 2019 02:39 IST|Sakshi

ట్రైన్‌ కదులుతుండగా ఖాళీగా కనిపించిన రిజర్వేషన్‌ బోగీలోకి హడావుడిగా ఎక్కేసింది ఆమె. కిటికీ పక్కన కూర్చున్న ఒక యువకుడు తప్ప ఆ బోగీలో ఇంకెవరూ లేరు. తన అదృష్టానికి మురిసిపోతూ ఆ యువకుడి ఎదురుగా ఉన్న సీటులో కూర్చుంది.
అతనికి ముప్పయ్యేళ్లు ఉంటాయి. చూడ్డానికి అమాయకుడిలా కనిపిస్తున్నాడు. తలవంచుకుని న్యూస్‌పేపర్‌ చదువుకుంటున్నాడు. ఆమె అతన్ని పలకరించింది.
‘‘హేయ్‌ మిస్టర్‌! మీ పేరు తెలుసుకోవచ్చా?’’
‘‘తెలుసుకోవచ్చు’’ అతను తలెత్తకుండానే బదులిచ్చాడు. ఆమె ఫక్కున నవ్వింది.
‘‘తమరు రోబోలా? అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబిస్తారా?’’ అడిగింది.
‘‘నా పేరు తెలుసుకుని మీరు చేసేదేముంది?’’ అతను ఎదురు ప్రశ్నించాడు.
‘‘నాకు గడగడా వాగే రోగముంది. ఎక్కువసేపు నోరుమూసుకుని ఉండలేను. జర్నీలో బోర్‌ కొట్టకుండా మీతో సరదాగా మాట్లాడాలనుకుని మీ పేరడిగాను’’ అందామె.
‘‘ముందు మీ పేరు చెప్పండి?’’
‘‘నా పేరు శూర్పణఖ!’’ అందామె చిలిపిగా.
‘‘అలాగైతే నా పేరు లక్ష్మణరావు!’’ అతను కూడా చిలిపిగా బదులిచ్చాడు.
ఆమె మరోసారి కిలకిలా నవ్వింది. ‘‘ఇక నిజం పేరు చెప్పేస్తాను బాబూ!.. నా పేరు హేమమాలిని. మా అమ్మ సినిమా నటి హేమమాలిని ఫ్యాన్‌. అందుకే నాకా పేరు పెట్టింది.’’ అందామె.
‘‘మా నాన్న ధర్మేంద్ర ఫ్యాన్‌ కాదు కాబట్టి నా పేరు ధర్మేంద్ర కాదు అశోక్‌!’’ అన్నాడతను.
‘‘గ్లాడ్‌ టు మీట్‌ యూ అశోక్‌’’ 
‘‘సేమ్‌ టు యూ డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని’’
‘‘మీరలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తోంది బాబు!’’ వయ్యారాలు పోతూ అందామె.
‘‘నేను పొగిడింది మిమ్మల్ని కాదు, హేమమాలినిని.’’
‘‘అయినా నన్ను కూడా పొగిడినట్టే భావిస్తాను. ఇంతకీ మీరెక్కడికెళుతున్నారు?’’
‘‘సికింద్రాబాద్‌’’
‘‘థ్యాంక్‌గాడ్‌! నేనూ అక్కడికే! ఒంటరిగా జర్నీ బోర్‌ కొడుతుందనుకున్నాను. ఇప్పుడు మీరు జతయ్యారు కాబట్టి ఇద్దరం ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకోవచ్చు.’’
‘‘నిజానికి నేను ఒంటరిగా లేను. అరగంట ముందు వరకు నా భార్య కూడా నాతోపాటు బోగీలో ఉంది. అరగంట ముందు ఆగిన స్టేషన్‌లో పళ్లు తీసుకొస్తానని చెప్పి కిందకు దిగింది. ఆమె పళ్లు తెచ్చేలోగా రైలు కదిలింది. ఆమె ఎక్కలేకపోయింది. ఈ ట్రైన్‌ వెనకే వస్తున్న మరో ట్రైన్‌లో ఎక్కి నాకు ఇందాకే ఫోన్‌ చేసింది. ఇద్దరం సికింద్రాబాద్‌లో కలుసుకుంటాం.’’
‘‘ఫర్వాలేదు. మీ భార్యకు బదులు నేను మీకు తోడుగా వచ్చేశాను. ఇక సికింద్రాబాద్‌ వరకు మీకు కంపెనీ ఇస్తాను. ప్రయాణం సరదాగా గడుస్తుంది’’ ఉత్సాహంగా అందామె.
‘‘సారీ! నేను మితభాషిని. మాట్లాడకుండా పేపర్‌ చదువుతూ కాలక్షేపం చేస్తా.’’
‘‘పేపర్‌ చదవడం బోర్‌ కాదా? వార్తలన్నీ స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు కదా!’’
‘‘పేపర్‌ స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌ భర్తీ చేయలేదు. ఫోన్‌లో చూసినవి గుర్తుండవు. కాని పేపర్‌లో చదివినవన్నీ బాగా గుర్తుంటాయి. పేపర్‌లో ఉండే ప్రత్యేకత అది.’’
‘‘పేపర్‌లో మీరేం చదువుతుంటారు?’’
‘‘రాజకీయ వార్తలు, క్రీడలు, సినిమా, క్రైమ్‌ కథలు వంటివి చదువుతుంటాను.’’
‘‘క్రైమ్‌ కథలు చదివితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?’’
‘‘ఎందుకుండదు? దేశంలో జరుగుతున్న రకరకాల నేరాల గురించి తెలుస్తుంది.’’
‘‘జరగబోయే నేరాల గురించి ముందే తెలుస్తుందా?’’
‘‘తెలియదు. ఎందుకలా అడుగుతున్నారు?’’
‘‘ఎందుకంటే ఇప్పుడొక నేరం జరగబోతోంది. దాన్ని మీరు పసిగట్టలేకపోయారు.’’
‘‘ఏమిటా నేరం?’’ అశోక్‌ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నేను మిమ్మల్ని దోచుకోబోతున్నాను.’’ నర్మగర్భంగా చెప్పింది హేమ.
‘‘గుడ్‌ జోక్‌!’’
‘‘జోక్‌ కాదు మిస్టర్‌! సీరియస్‌గానే చెబుతున్నాను. మర్యాదగా మీ పర్సులో ఉన్న డబ్బంతా ఇచ్చెయ్యండి’’ కటువుగా అందామె.
‘‘ఇవ్వకపోతే?’’
‘‘మీ పరువు తీస్తాను. చెయిన్‌ లాగి ట్రైన్‌ ఆపుతాను. నా దుస్తులు చించుకుని కేకలేస్తాను. మీరు నాపైన బలాత్కార ప్రయత్నం చేశారని అందరికీ చెబుతాను. జనం మిమ్మల్ని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగిస్తారు. చెప్పండి. తన్నులు తిని జైలుకెళతారా? లేక మర్యాదగా మీ పర్సు నాకిస్తారా?’’ కఠినంగా పలికిందామె.
‘‘ఓహో! నీ వృత్తి బ్లాక్‌మెయిలింగ్‌ అన్నమాట!’’
‘‘యస్‌. ఇంతవరకు ఇలా తొమ్మిది మందిని నేను వేర్వేరు ప్రాంతాల్లో బ్లాక్‌మెయిల్‌ చేశాను. వారిలో ఎనిమిది మంది బుద్ధిగా నాకు డబ్బు ఇచ్చి పరువు కాపాడుకున్నారు. ఒక్కడే నాకు ఎదురు తిరిగాడు. ఫలితంగా జనం చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. మీకూ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే బుద్ధిగా డబ్బు ఇచెయ్యండి’’ అందామె.
‘‘నాకు ఆ పరిస్థితి రాదు. కావాలంటే పరీక్షించి చూసుకో!’’ నిర్లక్ష్యంగా అన్నాడతను.
‘‘ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వద్దు మిస్టర్‌. నా మాట వింటే క్షేమంగా గమ్యం చేరుతారు. లేదంటే పరువు పోగొట్టుకుని జైలుకెళతారు.’’
‘‘జైలుకెళ్లేది నేను కాదు, నువ్వు!’’
‘‘చివరిసారి హెచ్చరిస్తున్నాను. డబ్బు ఇస్తారా, లేదా?’’ కోపంగా లేచి నిలబడిందామె.
‘‘ఇవ్వను. నీకు చేతనైంది చేసుకో..’’ అశోక్‌ నిర్లక్ష్యంగా అన్నాడు.
హేమకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే చెయ్యెత్తి చెయిన్‌ లాగింది. తర్వాత ఒంటి మీద బట్టలు చింపుకుంది. రైలు ఆగగానే ‘‘రక్షించండి... రక్షించండి...’’ అంటూ పెద్దగా కేకలు వేయసాగింది.
పక్కబోగీల వారందరూ అక్కడకు పరుగెత్తుకు వచ్చారు. వాళ్లను చూడగానే హేమ చిరిగిన తన దుస్తులు చూపిస్తూ ‘‘బోగీలో ఎవరూ లేకపోవడం చూసి ఈ దుర్మార్గుడు నన్ను బలాత్కారం చేయబోయాడు. నా బట్టలు చించేశాడు..’’ అంటూ గట్టిగా ఏడవసాగింది. 
జనం ఆవేశంగా అశోక్‌ని చుట్టుముట్టారు. రైల్వేగార్డు అశోక్‌ కాలర్‌ పట్టుకున్నాడు. ‘‘ఏరా కళ్లు నెత్తికెక్కాయా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై చెయ్యేస్తావా?’’ గద్దించాడు.
‘‘ఆమె చెప్పేది అబద్ధం. నేనామెను ముట్టుకోలేదు’’ అశోక్‌ శాంతంగా బదులిచ్చాడు.
‘‘నువ్వు నిజం చెబుతున్నావని రుజువేమిటి?’’ గార్డు నిలదీశాడు.
‘‘నేను చెప్పింది నిజమని ఒక్క క్షణంలో రుజువు చేస్తాను’’ అంటూ అశోక్‌ కిందకు వంగి బెర్తు కింద ఉన్న ఊత కర్రను బయటకు లాగాడు. దాని సాయంతో అతి కష్టంమీద లేచి నిల్చున్నాడు. అందరూ అతని కాళ్లవైపు చూసి ఉలిక్కిపడ్డారు. అతనికొక కాలు లేదు.
‘‘నేను ఆర్మీ సోల్జర్‌ని. ఆరునెలల కిందట బాంబ్‌ బ్లాస్ట్‌లో కుడికాలు పోగొట్టుకున్నాను. ఊతకర్ర లేకుండా ఒక్క అడుగు కూడా కదల్లేను. చేతుల్లోనూ బలం లేదు. అలాంటప్పుడు నేను బలాత్కార ప్రయత్నం ఎలా చెయ్యగలను?’’ అన్నాడు అశోక్‌.
తన బండారం బయటపడటంతో హేమ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. కాని ప్రయాణికులు చుట్టుముట్టడంతో పారిపోలేక పాలిపోయిన ముఖంతో తలదించుకుని నిల్చుండిపోయింది.
గార్డు అశోక్‌ని అభినందిస్తూ ‘‘ఒక మోసగత్తెను చట్టానికి పట్టించి మంచి పని చేశారు. ఈమె పట్టుబడకపోతే ఇంకెంతోమందిని ఇలాగే దోచుకుని ఉండేది. అయినా మీరు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించడం  మంచిది కాదు’’ అన్నాడు. 
అశోక్‌ తన భార్య పళ్ల కోసం ఇదివరకు ఆగిన స్టేషన్‌లో దిగిన సంగతి గార్డుకి చెప్పాడు. ‘‘అదృష్టవశాత్తు ఈ మోసగత్తె దృష్టి నా కాళ్లపై పడలేదు. నాకొక కాలు లేదని తెలిస్తే ఈమె నా పర్సుతో పాటు నా మెడలోని గొలుసు లాక్కున్నా నేనేమీ చెయ్యలేకపోయేవాణ్ణి.’’
‘‘మీ భార్య మీ వెంట ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా’’ అన్నాడు గార్డు
‘‘నా భార్య ఉంటే ఈమె ఈ బోగీ ఎక్కేది కాదు. బ్లాక్‌మెయిల్‌ చేసేది కాదు. పట్టుబడేది కాదు. నా భార్య రైలు దిగడం వల్లనే ఈమె పట్టుబడింది. అందుకే అంటారు పెద్దలు ఏది జరిగినా మన మంచికే అని..’’ అన్నాడు అశోక్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరైన ప్రాయశ్చిత్తం

బండలు

తేనెపట్టులా నీ పలుకే..

పరలోకాన్ని దూరం చేసిన ‘అనుమానం’!!

విశ్వానికి ఆదిశిల్పి పుట్టిన రోజు

నన్ను పదకొండో కొడుకుగా చూసుకో...

పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?

ఆరోగ్య కారకం

ఓనమ్‌ వచ్చెను చూడు

డిస్నీ బ్యూటీ

తల్లి హక్కు

దాని అంతు నేను చూస్తాను

పాఠాల పడవ

జయము జయము

ఫైబ్రాయిడ్స్‌ తిరగబెట్టకుండా నయం చేయవచ్చా?

పెద్దలకూ పరీక్షలు

పావనం

పగుళ్లకు కాంప్లిమెంట్స్‌

నేను సాదియా... కైరాళీ టీవీ

డౌట్‌ ఉంటే చెప్పేస్తుంది

ఇడ్లీ.. పూరీ... మరియు భర్త

ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు.

కొండలెక్కే చిన్నోడు

వాల్వ్స్‌ సమస్య ఎందుకు వస్తుంది?

సైకిల్‌ తొక్కితే.. కి.మీ.కు రూ.16!

హారతి గైకొనుమా

పవిత్ర జలం

చేజేతులా..!

ఏ తల్లి పాలోఈ ప్రాణధారలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాకు పది లక్షల విరాళం

ఇక మా సినిమా మాట్లాడుతుంది

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

సైరా కెమెరా

పండగకి వస్తున్నాం