ఈలాన్‌ మస్క్‌ ప్లాన్‌... ఇల్లిల్లూ ఓ జనరేటర్‌

6 Feb, 2018 00:11 IST|Sakshi
సోలార్‌ పెంకులు

సౌరశక్తిని వాడుకునే విషయంలో ఉన్న ప్రధాన అడ్డంకి... ప్యానెల్స్‌ కోసం పెట్టే పెట్టుబడి. వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో కరెంటు బిల్లు ఆదా అవుతుంది కాదా అని చాలామంది సౌరశక్తి వాడకం విషయంలో వెనుకంజ వేస్తూంటారు. ఈ సమస్యను తీర్చేందుకు టెస్లా కార్ల కంపనీ వ్యవస్థాపకుడు ఈలాన్‌ మస్క్‌  ఓ వినూత్నమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. తన కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సోలార్‌ పెంకులు, బ్యాటరీలను 50 వేల ఇళ్లకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ ప్రయోగం జరగబోతోంది.

పైకప్పులకు వాడే పెంకుల మాదిరిగానే మస్క్‌ కంపెనీ సోలార్‌ ప్యానెల్స్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగంలో భాగంగా ముందు వెయ్యి ఇళ్లల్లో ఈ ప్యానెల్స్, బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. వీటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా ఆ వెయ్యి కుటుంబాల వారు ఉచితంగా వాడుకుంటారు. వాడుకోగా మిగిలిన విద్యుత్తును బ్యాటరీలలో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు గ్రిడ్‌కు పంపుతారు. ఇలా సంపాదించే డబ్బుతోనే ప్యానెల్స్, బ్యాటరీల ఏర్పాటుకు పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు మస్క్‌ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఐడియా భలే ఉంది కదూ...  

మరిన్ని వార్తలు