సీవీఆర్, చోహన్‌ క్యు సాగు పద్ధతులపై శిక్షణ

28 Jan, 2020 07:02 IST|Sakshi

దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్‌ క్యు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, స్వచ్ఛంద సంస్థ ‘సర్ర’ డైరెక్టర్‌ రోహిణీ రెడ్డి (బెంగళూరు)తోపాటు.. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా వాడే మట్టి సేద్య పద్ధతి ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్‌) ఈ నెల 29(బుధవారం)న రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం రిక్వెల్‌ ఫోర్డ్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు శిక్షణ ఇస్తారు. డా. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు ఈ శిక్షణలో రైతులకు తెలియజేస్తారు. డా. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్‌ (ఫుడ్‌ ఆల్వేస్‌ ఇన్‌ ద హోమ్‌) బెడ్‌ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యేక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. వివరాలకు.. సంపత్‌కుమార్‌ – 98854 55650, నీలిమ – 99636 23529.

సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ
సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్‌.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయ రంగంలో వివిధ స్థాయిలో వ్యాపారావకాశాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు, సమస్యలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు 5 రోజుల రెసిడెన్షియల్‌ శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు సి.ఎస్‌.ఎ. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. పిజిఎస్‌ ఇండియా సేంద్రియ సర్టిఫికేషన్‌ నియమాలపై కూడా అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్‌ తార్నాకలోని సెయింట్‌ ఆన్స్‌ జెనరలేట్‌లో జరుగుతుంది. ఫీజు రూ. 15 వేలు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన నంబరు.. 85006 83300. trainings@csa-india.org/https://csa-india.org/events/200217-organic-food-marketing/

2న కొర్నెపాడులో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2 (ఆదివారం)న గొర్రెలు, మేకల పెంపకంపై కడప జిల్లాకు చెందిన పశువైద్య నిపుణులు డా. జి. రాంబాబు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు 97053 83666, 0863–2286255

2న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్‌ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349.

రేపు సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్‌పై సదస్సు
సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, మార్కెటింగ్‌ సమస్యలపై ఈ నెల 29(బుధవారం) మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని మారుతి నర్సరీ(అమ్మపల్లి, నర్కోడా–ఒయాసిస్‌ స్కూల్‌ ఎదురు)లో రైతులు, వ్యాపారుల అవగాహన సదస్సు జరగనుంది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, హార్ట్‌ ట్రస్టు, భారతీయ కిసాన్‌ సంఘ్‌ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వివరాలకు.. ఎం.ఎస్‌. సుబ్రహ్మణ్యం రాజు – 76598 55588, మహిపాల్‌రెడ్డి – 76609 66644

మరిన్ని వార్తలు