సైక్లింగ్‌ వల్ల మోకాళ్లు మరింత దెబ్బతింటాయా?

26 Dec, 2019 00:08 IST|Sakshi

అపోహ – వాస్తవం

అపోహ : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు సైక్లింగ్‌ చేయడం వల్ల ఆ నొప్పులు మరింత పెరుగుతాయి.

వాస్తవం : సైక్లింగ్‌ ఎక్సర్‌సైజ్‌ వల్ల లేదా సైకిల్‌ తొక్కడం వల్ల మోకళ్లు మరింత దెబ్బతింటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని మోకాళ్ల నొప్పుల నివారణకు అది మంచి వ్యాయామం. మామూలు సైకిల్‌ తొక్కినా, లేక ఒకేచోట స్థిరంగా ఉండే ఎక్సర్‌సైజ్‌ సైకిల్‌ తొక్కినా మీ బరువు మీ శరీరంపై పడదు. కాబట్టి మోకాళ్లపై శరీరం బరువు చాలా తగ్గిపోతుంది. సైక్లింగ్‌లో పెడల్‌ తొక్కడం వల్ల మోకాళ్లు బాగా కదిలి మంచి ఎక్సర్‌సైజ్‌ అవుతుంది. ఇక ఈత (స్విమ్మింగ్‌)లో కూడా శరీరం బరువు మోకాళ్లపై ఏమాత్రం పడదు కాబట్టి అది కూడా చాలా మంచి ఎక్సర్‌సైజ్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు