వ్యాయామంతో అల్జీమర్స్‌కు చెక్‌

9 Sep, 2018 09:35 IST|Sakshi

లండన్‌ : రోజూ వ్యాయమంతో అల్జీమర్స్‌ను నియంత్రించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రి పరిశోధకులు ఎలుకలపై చేపట్టిన ప్రయోగంలో ఈ ఫలితాలు రాబట్టారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని వాపు ప్ర్రక్రియను నివారించవచ్చని అథ్యయన రచయిత రుడీ తాంజి పేర్కొన్నారు. వ్యాయామంతో మెదడు పనితీరు మెరుగైన క్రమంలో అల్జీమర్స్‌కు దారితీసే కారకాలు తగ్గుముఖం పట్టినట్టు అథ్యయనంలో గుర్తించారు.

ఎలుకలపై చేసిన ప్రయోగంలో వ్యాయామంతో ఉత్తేజితమమ్యే మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడ్డాయని తేలిందన్నారు. మానవుల్లోనూ వ్యాయామంతో ఇలాంటి ఫలితాలు చేకూరతాయని అథ్యయనం అంచనా వేసింది. మెదడు కణాలను ఉత్తేజితం చేసే మందులను రూపొందించే దిశగా పరిశోధన బాటలు వేస్తుందని చెప్పారు. రోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్‌, సైక్లింగ్‌ల ద్వారా మెదడుకు రక్తసరఫరా, ఆక్సిజన్ మెరుగ్గా అందుతాయని, ఫలితంగా మెదడు పనితీరు సామర్ధ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు డాక్టర్‌ సె హున్‌ చోయ్‌ తెలిపారు. అల్జీమర్స్‌తో బాధపడే రోగులు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు.

మరిన్ని వార్తలు