చుండ్రుకు ఉసిరి

9 Dec, 2019 00:36 IST|Sakshi

బ్యూటిప్స్‌

కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు  అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి. ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను ఉసిరితో తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి  వైద్యులు చెబుతున్నారు.
  

రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు  తగ్గుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్‌ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది. 

మరిన్ని వార్తలు