పాముకంటే డేంజర్...

11 Apr, 2016 22:48 IST|Sakshi
పాముకంటే డేంజర్...

కప్పాము

 

ఇక్కడ ఫొటోలో బంగారు రంగులో అమాయకంగా కనిపిస్తున్న కప్ప అలాంటిలాంటి కప్ప కాదు. ఎక్కడైనా పాములను చూస్తే కప్పలు భయపడతాయి గానీ, ఈ కప్పను చూస్తే పాములే భయపడాలి. ఎందుకంటే, ఇది కాలనాగుల కన్నా ఖతర్నాక్ మరి. ఒక్కసారి ఇది విడుదల చేసే విషం దెబ్బకు ఏకంగా జమాజెట్టీల్లాంటి పదిమంది మనుషులు పరలోకానికి పోవాల్సిందే! అలాగని ఇదేమంత భారీ జీవి కాదు. పూర్తిగా ఎదిగిన తర్వాత కూడా దీని సైజు దాదాపు ఐదున్నర సెంటీమీటర్ల వరకే ఉంటుంది.


కొలంబియా అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ జాతి కప్పలు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈస్ట్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ జాతి కప్పలపై విస్తృతంగా అధ్యయనం చేసి, ఇవి పాముల కంటే ప్రమాదకరమైన జీవులని తేల్చారు. సమీపంలో శత్రువు ఉన్నట్లయితే ఈ కప్పలు వెంటనే అప్రమత్తమైపోయి, చర్మం ద్వారా విషాన్ని స్రవిస్తాయని, గ్లోవ్స్ లేకుండా వీటిని తాకితే ప్రాణాపాయం తప్పదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు