బాష్‌...ఫ్రమ్‌ బాలీవుడ్‌; ఇది పండగ కల్చర్‌

26 Oct, 2019 09:06 IST|Sakshi

దీపావళి గ్రాండ్‌ ఫెస్టివల్‌. గోల్డ్‌ ఫెస్టివల్‌. హంగు..ఆర్భాటాలతో సాగుతుంది. అందుకే ఇది పార్టీ ప్రియులకు ఇష్టమైన పండుగ. సిటీలో పార్టీలందు పండుగ పార్టీలు వేరయా.... మరీ ముఖ్యంగా దీపావళి పండుగ అంటే  చాలు సిటీ పార్టీ సర్కిల్‌కి ఎక్కడ లేని ఉత్సాహమొస్తుంది. ఒక పార్టీకి ఉండాల్సిన హంగులన్నీ ఉంటాయి. దీపావళి బాష్‌ పేరిట బాష్‌...ఫ్రమ్‌ బాలీవుడ్‌... బాలీవుడ్‌ నుంచి సినిమాలు ఫ్యాషన్లు మాత్రమే కాదు అక్కడి పార్టీలు కూడా సిటీకి ట్రెండీగా మారతాయి ఈ దివాళి భాష్‌లు ఒక ఉదాహరణ. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రతి ఏడాదీ దివాళి పార్టీ ఇస్తారు.  అలాగే షారూఖ్‌ఖాన్‌  నివాసం మన్నత్‌ దివాళి బాష్‌ సందడితో వెలిగిపోతుంది. వీరితో పాటు అనిల్‌కపూర్,  శిల్పాశెట్టి, కరణ్‌ జోహార్, ఏక్తాకపూర్, అర్పితా శర్మ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు నిర్వహించే దివాళి బాష్‌ కోసం బాలీవుడ్‌ ఏడాదంతా వేచి చూస్తుంది. య«థా సెలబ్రిటీ తథా సిటీ అన్నట్టుగా... నగరంలోని రిచ్‌ పీపుల్‌ కూడా ఎవరికి వారు తమ అతిథులను మెప్పించడానికి దివాళి బాష్‌ను ఎంచుకున్నారు.  – సాక్షి,సిటీబ్యూరో

సంప్రదాయ దుస్తుల డిజైన్లలో ఇంత వెరైటీనా?
క్రాకర్స్‌లో ఇంతగా వింత మెరుపులు మెరిపించేవీ ఉంటాయా? అన్ని స్వీట్స్‌ తినేసింది నేనేనా?... ఇలాంటి ఆశ్చర్యానందాలకు లోనవుతోంది పార్టీ సర్కిల్‌. దీపావళి పండుగ సందర్భంగా వెల్లువెత్తుతున్న ..దీవాళి బాష్‌ పేరిట సాగే పార్టీలతో ‘రిచ్‌’ సిటీ హోరెత్తుతోంది. పండుగ అనుభూతులను రెట్టింపు చేస్తూ పేజ్‌ త్రీ సర్కిల్‌ శభాష్‌ అనే అభినందనలు అందుకుంటోంది.  

కలర్‌ఫుల్‌... క్లిక్స్‌ 
గోల్డ్‌ కలర్‌ దీపావళ పండుగకు థీమ్‌ కలర్‌గా చెబుతారు. అందుకే ఇంట్లో అమర్చే వంట పాత్రలతో సహా గోల్డ్, కాపర్, సిల్వర్‌ లోహాలతో కళ్ల ముందు మెరుస్తాయి. ప్లాస్టిక్‌ అలంకరణ వస్తువులకు ఈ రంగులు పూయడం లేదా సింపుల్‌గా ఒక పార్టీ షాప్‌కి వెళ్లి గోల్డ్‌/సిల్వర్‌ కలర్డ్‌ ప్లాస్టిక్‌ కట్లరీని కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని ఫొటోలైనా సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయకపోతే నువ్వు పార్టీకి అసలు వెళ్లినట్టు ఏంటి ఆధారం? అందుకే ఈ బాష్‌లలో సెల్ఫీ కార్నర్స్, ఫొటో బూత్స్‌ తప్పనిసరిగా మారాయి. దీనిలో క్యాప్స్, హ్యాట్స్, సన్‌గ్లాసెస్, ఫన్నీ మెసేజెస్‌తో హెడ్‌ బ్యాండ్స్, సెల్ఫీ స్టిక్స్‌ తదితర యాక్సెసరీస్‌ అమరుస్తున్నారు. 

వావ్‌ అనిపించే డిజైన్డ్‌ పార్టీస్‌...
సమయం సరిపోక వెళ్లడం కుదరదు గానీ లేకపోతే ఇన్వైట్‌ చేసిన దివాళీ బాష్‌లు అన్నింటికీ వెళ్లాలనిపిస్తుంది. అంత బాగా డిజైన్‌ చేస్తారవి.   రెండ్రోజుల క్రితం ఒక పార్టీకి వెళ్లాను. ఎత్నిక్‌ డ్రెస్సింగ్స్, లైవ్‌ బ్యాండ్స్, క్రాకర్స్, డ్యాన్స్‌లు.. ఆ రిచ్‌నెస్‌..ఓహ్‌ అద్భుతంగా అనిపించింది. వేరే లోకంలో ఉన్నామన్నట్లు ఉంది. ఇవి ఏడాదిలో దీపావళికి మాత్రమే జరిగినా ఏడాది మొత్తం టాక్‌ ఆఫ్‌ ద టవున్‌ అవుతాయి.  
...హేమంత్‌సిరి, ఫ్యాషన్‌ డిజైనర్‌ 

పార్టీకి రెడీ... 
దివాళి బాష్‌ ఎప్పుడూ మాకు స్పెషల్‌. మేమిచ్చే పార్టీస్, మేం అటెండయ్యే పార్టీస్‌తో ఈ వారమంతా సందడిగా గడచిపోతుంది. వ్యక్తిగతంగా కాకుండా ఫ్యామిలీస్‌తో కలిసిపోయే సందర్భం కావడంతో దీవాళి బాస్‌ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది 
... సుశీలా బొకాడియా, పేజ్‌త్రీ సెలబ్రిటీ 

హోమ్‌...థీమ్‌ పార్టీ... 
పండుగకు వారం రోజుల ముందుగానే సిటీలో ఈ బాష్‌ ఊపందుకుంటుంది.  ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌కు  అత్యంత అనువైన పండుగ కావడం, దీనికి తోడు ఇది ఎవరి నివాసంలో వారు ఆతిథ్యమివ్వడతో సంపూర్ణమైన  హోమ్లీ పార్టీగా జరుగుతుంది. ఈ పార్టీలకు డెకార్‌ చాలా కీలకం. క్లాసిక్‌ ఫ్లవర్‌ లైట్‌ డెకార్‌ నుంచి, ద్వార బంధాలకు పూల దండలు తగిలించడం ఇంట్లో నలుమూలలా దీపాలు అమర్చడం, దీపపు ఆకారంలో ఉండే క్యాండిల్స్‌ పార్టీకి వింతశోభను అద్దుతాయి. వంటి అలంకరణలతో ఇంటింటా ఫెస్టివల్‌ శోభ పురివిప్పుతుంది.   

మ్యాజిక్‌ స్వీట్స్‌... మ్యూజిక్‌ హిట్స్‌
స్వీట్స్‌ లేని పండుగ ఉండదు. అసలు దీపావళి అంటేనే మిఠాయిల పండుగ.. విభిన్న రకాల రుచులు ఈ పండుగ పార్టీస్‌లో వండి వడ్డిస్తారు. కండెన్స్‌డ్‌ మిల్క్, కోకోనట్‌ లాడూస్, షాహి తుక్డా, ఖీర్‌ వంటివి చవులూరిస్తుంటాయి. మొత్తం కుటుంబాన్ని, బంధుమిత్రులను ఒక దరికి చేర్చే పార్టీలో సహజంగానే రకరకాల వినోద భరిత కార్యక్రమాలు ఉంటాయి. అం త్యాక్షరి, పాస్‌ ఇన్‌ ది పార్సిల్‌ వంటి ఆటలు   పాపులరై ఇప్పటికీ పార్టీలకు ఊపునిస్తున్నాయి.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా