ఢిల్లీషియస్

30 Apr, 2016 15:37 IST|Sakshi
ఢిల్లీషియస్

ఇది ‘ఆప్’ కా మెనూ!
ఆమ్ ఆద్మీ పార్టీ మెనూ అనుకునేరు
ఆప్ కా అంటే ‘మీ’ మెనూ!  ఢిల్లీ మెనూ!
చురుగ్గా ఉంటుంది.  తళుక్కుమంటుంది.
కటుక్కుమంటుంది. ఇక మిగిలిందల్లా  గుటుక్కుమనడమే!
ఢిల్లీ దర్బార్ నుంచి మీ కోసం తెచ్చాం ఢిల్లీషియస్!

 

మ్యాంగో లస్సీ
 
కావలసినవి: మామిడి పండు ముక్కలు - ఒకటిన్నర కప్పు
 తాజా పెరుగు - అర కప్పు; పంచదార - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ:    మామిడిపండు ముక్కలు, పెరుగును ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తీయాలి.
మిక్సర్‌జార్‌లో మామిడి పండు ముక్కలు, పెరుగు, పంచదార వేసి బ్లెండ్ చేయాలి.
గ్లాసులో పోసి పుదీనా ఆకులు, మామిడిపండు ముక్కలతో అలంకరించి చల్ల చల్లగా వెంటనే అందించాలి.
 
పనీర్ బేగం బహార్
కావల్సినవి:
పనీర్ ముక్కలు - కప్పు
యాలకులు - 4
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 4
ఎండుమిర్చి - 3
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగి, మెత్తగా రుబ్బాలి)
అల్లం - వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
టొమాటో తరుగు - ఒకటిన్నర కప్పు (మెత్తగా రుబ్బాలి)
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
కారం - టీ స్పూన్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - చిటికెడు
పాల మీగడ - టేబుల్ స్పూన్
వెన్న- టీ స్పూన్
నెయ్యి - టీ స్పూన్
 
తయారీ
♦     పనీర్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేసి, నూనెలో వేయించి పక్కన ఉంచాలి.
♦     కడాయిలో నెయ్యి వేడయ్యాక చితక్కొట్టిన యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి వేయించాలి.
♦     ఉల్లిపాయల పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 4-5 నిమిషాలు వేయించాలి.
♦     దీంట్లో టొమాటో గుజ్జు వేసి మరో 10 నిమిషాలు ఉడికిస్తే మిశ్రమం బాగా చిక్కబడుతుంది.
♦     దీంట్లో వేయించిన పనీర్ ముక్కలు, జీడిపప్పు పలుకులు, కొత్తిమీర ఆకులు, కారం, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
♦     మిరియాల పొడి, పాల మీగడ, వెన్న, నెయ్యి వేసి కలిపి దించాలి.
 
క్రిస్పీ స్టఫ్డ్ హరా భరా
 
కావలసినవి:
♦  కాబూలీ చనా (శనగలు) - ముప్పావు కప్పు
♦ బీన్స్, క్యారట్స్ (సన్నగా తరిగినవి) - 2 కప్పులు
♦ పచ్చిబఠాణీలు - అర కప్పు;
♦ మైదా - 2 టేబుల్ స్పూన్లు,
♦ శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు;
♦ ఆవ నూనె - 2 టేబుల్ స్పూన్లు
♦ జీలకర్ర పొడి, యాలకుల పొడి,
♦ దాల్చిన చెక్క పొడి - టీ స్పూన్
♦ ఛీజ్ - 2 టేబుల్ స్పూన్లు
♦ నిమ్మరసం - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత
♦ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
♦ కార్న్‌ఫ్లోర్ - 2 టీ స్పూన్లు
♦ పచ్చిమిర్చి - 5  (సన్నగా తరగాలి)
♦ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
 
తయారీ
♦     శనగలను, పచ్చిబఠాణీలను విడివిడిగా ఉడికించి, గరిటతో కచ్చాపచ్చాగా మెదిపి పక్కన ఉంచాలి.
♦     పెద్ద గిన్నెలో బీన్స్- కార్యట్ తరుగు, పచ్చిబఠాణీ, శనగపిండి, మైదా, ఆవనూనె, సిద్ధం చేసుకున్న గరం వేసి కలపాలి.
     దీంట్లో కొద్దిగా ఛీజ్ వేయాలి.
♦     బాగా మెదిపిన శనగలు, పచ్చిబఠాణీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి.
♦     పై వన్నీ కలిపి, తగినంత ఉప్పు వేసి మిక్సర్‌లో ఒకసారి బ్లెండ్ చేయాలి. లేదంటే రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి.
♦     ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు తీసుకొని, అదిమి, కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా బాగా కాల్చాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ కబాబ్స్‌ను సగానికి కట్ చేసి, సన్నగా తరిగిన ఛీజ్‌ను మధ్యలో కూరాలి.
♦     సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారట్, ఉల్లిపాయలతో అలంకరించి... చిలికిన పెరుగుతో వడ్డించాలి.
 
ఛోలే భటురా
 
కావలసినవి:
♦ కాబూలీ చనా (శనగలు) - కప్పు
♦ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
♦ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
♦ ఉప్పు - తగినంత, టొమాటో తరుగు - కప్పు
♦ దానిమ్మ గింజలు - అర కప్పు (మెత్తగా రుబ్బాలి)
♦ పాల మీగడ - 2 టీ స్పూన్లు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; కారం - టీ స్పూన్; పచ్చిమిర్చి - 2
♦ ఎండుమిర్చి - 2; వెన్న - 2 టీ స్పూన్లు
♦ జీలకర్ర, ఆవాలు - టీ స్పూన్; లవంగాలు-3 యాలకులు-3 దాల్చిన చెక్క-చిన్న ముక్క
 
తయారీ
 ♦    శనగలను టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి కలిపి ఉడికించి, నీళ్లను వడకట్టి పక్కనుంచాలి.
  ♦   కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి.
♦     కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగు, సిద్దం చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా ఉడికించాలి.
 ♦    దీంట్లో ఉడికించిన శనగలను కలపాలి.
♦     టొమాటో, శనగలు బాగా ఉడికాక దీంట్లో మెత్తగా రుబ్బిన దానిమ్మ గింజల పేస్ట్ కలపాలి.
♦     సన్నని మంట మీద ఈ మిశ్రమం 30 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. త్వరగా కావాలంటే కుకర్‌లో ఉడికించవచ్చు.
♦     శనగల మిశ్రమం బాగా మెత్తగా అయ్యి, మిశ్రమం చిక్కబడ్డాక చిలికిన పాల మీగడ, వెన్నె కలిపి, మరో 10 నిమిషాలు ఉంచి, మిరియాల   పొడి చల్లి దించాలి.
 
లాంబ్ చాప్స్.. విత్ మఖనీ సాస్
 
కావల్సినవి:
♦ లాంబ్ చాప్స్ (ఎముకలున్న గొర్రె మాంసం ముక్కలు) - 4, ఉప్పు - తగినంత
♦ మిరియాల పొడి - చిటికెడు
♦ అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
♦ ఆవనూనె - టీ స్పూన్
♦ పెరుగు - టేబుల్ స్పూన్
♦ కారం - అర టీ స్పూన్
♦ ధనియాల పొడి - పావు టీ స్పూన్
♦ దాల్చిన చెక్క పొడి - చిటికెడు
 
తయారీ:
♦     గిన్నెలో లాంబ్ చాప్స్, ఉప్పు, మిరియాలపొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఆవనూనె, పెరుగు వేసి కలపాలి. దీనిని అర గంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత కారం, ధనియాలపొడి, దాల్చిన చెక్కపొడి వేసి కలిపి రాత్రిమొత్తం ఫ్రిజ్‌లో ఉంచాలి.
♦     కడాయిలో నూనె వేసి కాగాక బాగా నానిన మాంసం ముక్కలను వేయించాలి. (ఈ ముక్కలను బొగ్గుల కుంపటి మీద గ్రిల్ చేసుకోవచ్చు) దీంట్లో కప్పు నీళ్లు కలిపి ఉడికించాలి. ముక్క మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
 
మఖనీ సాస్ కోసం...
♦ కడాయిలో టీ స్పూన్ నూనె వేసి టొమాటో గుజ్జు - టేబుల్ స్పూన్, కారం- చిటికెడు, జీడిపప్పు పొడి- అర టీ స్పూన్, చిటికెడు మెంతిపొడి, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికాక పాల మీగడ, వెన్న వేసి కలిపి దించాలి. తయారుచేసుకున్న లాంబ్ చాప్స్‌ని ప్లేట్‌లో సర్ది, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మఖనీ సాస్ , కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి.
 
రబ్డీ
 కావలసినవి:
♦ పాలు - 5 కప్పులు; యాలకులు - 4
♦ పంచదార - 2 టేబుల్ స్పూన్లు
♦ కెవ్డా (మొగలి) ఎసెన్స్/ రోజ్‌వాటర్ - 3 చుక్కలు
♦ యాలకుల పొడి - చిటికెడు
♦ పిస్తాపప్పు పొడి - చిటికెడు
♦ కుంకుమపువ్వు - 5 రేకలు
♦ ఎడిబుల్ సిల్వర్ ఫాయిల్
 
తయారీ
♦ మందపాటి పెద్ద గిన్నెలో పాలు పోసి, సన్నని మంట మీద మరిగించాలి.
 ♦ పాలు బాగా మరిగాక పంచదార, యాలకుల గింజలు వేసి 2 కప్పుల పాలు అయ్యేంత వరకు మరిగించాలి.
♦  మంట తీసేసి ఎసెన్స్/రోజ్‌వాటర్ కలపాలి.
♦ ఎడిబుల్ సిల్వర్ ఫాయిల్ (ఇది లేకపోయినా ఫర్వాలేదు), యాలకుల పొడి, పిస్తా పొడి, కుంకుమ పువ్వు వేసి వేడిగానూ, చల్లగానూ అందించవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ