ఆధునిక వ్యాధులకు  దేశీ ఆహారమే దివ్యౌషధం!

6 Oct, 2018 00:18 IST|Sakshi

7న సికింద్రాబాద్‌లో, 8న హనుమకొండ, కరీంనగర్‌లో డా. ఖాదర్‌వలి ప్రసంగాలు

మధుమేహం, హృద్రోగాలు, ఊబకాయం, కేన్సర్, కిడ్నీ జబ్బులు, థైరాయిడ్‌ సమస్యలు, విటమిన్‌ డి, బి12 లోపం, విషజ్వరాలు.. వంటి ఆధునిక వ్యాధుల నియంత్రణకు, నిర్మూలనకు.. సంపూర్ణ ఆరోగ్య సాధనకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన సిరిధాన్యాలు, కషాయాలు వంటి దేశీయ ఆహారమే దివ్యౌషధాలని ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త, అటవీ వ్యవసాయ నిపుణులు  డా. ఖాదర్‌వలి(మైసూరు) అంటున్నారు.  ఔషధ విలువలతో కూడిన సిరిధాన్యాలు, కషాయాలతో అన్ని రకాల వ్యాధులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చంటున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ నెల 7,8 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు.

తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సభల్లో ప్రసంగించిన అనంతరం సభికుల ప్రశ్నలకు డా. ఖాదర్‌ సమాధానాలిస్తారు. ఈ నెల 7(ఆదివారం)న మ. 2 గం.–5.30 గం. వరకు సికిందరాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో ప్రసంగిస్తారు. 8(సోమవారం)న ఉ. 9.30 గం.–మ. 12.30 గం. వరకు హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియం(సుబేదారి, హనుమకొండ)లో, అదే రోజు సా. 3 గం.–6 గం. వరకు కరీంనగర్‌లోని వైశ్య భవన్‌(గాంధీరోడ్, కరీంనగర్‌)లో డా. ఖాదర్‌ ప్రసంగిస్తారని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు