లాక్మే సంపూర్ణ స్టయిల్‌

28 Feb, 2020 07:39 IST|Sakshi

ఏ నెల అయినా... ఏ కాలమైనా ఇకత్, కాటన్‌ హ్యాండ్లూమ్స్‌తోడిజైన్‌ చేసిన డ్రెస్సులుఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి.దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం వచ్చిన అమెరికన్‌ నవల ‘లిటిల్‌ ఉమెన్‌’లోనిజో మార్చ్‌ పాత్రనుస్ఫూర్తిగా తీసుకొనిడిజైన్‌ చేసిన డ్రెస్సులుఈ ఆధునిక కాలానపరిచయం చేశారు‘ఎకా’ లేబుల్‌ డిజైనర్‌ రీనా సింగ్‌. తెలంగాణ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (టిస్కో)సహకారంతో తెలంగాణ వస్త్రాలకు అధునికతను జోడించిఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వేదిక మీద ప్రదర్శించారు.

హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేసిన ఇకత్‌ కాటన్‌ జాకెట్‌లో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వేదిక మీద ఆకట్టుకుంది. స్టైలిష్‌ ప్రింటెడ్‌ స్పగెట్టి టాప్, వెల్వెట్‌ వైడ్‌ లెగ్‌హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ ప్యాంటు మీద కాటన్‌ జాకెట్‌ను ధరించింది. చేత్తో చేసిన జర్దోసీ, అందమైన పువ్వులు, కాలర్, కఫ్స్, పాకెట్స్, బెల్ట్‌ల వంటి వాటితో ఈ కలెక్షన్‌కి అదనపు హంగులు తీసుకొచ్చారు. హ్యాండ్లూమ్స్‌తో ప్లీటెడ్‌ స్కర్ట్స్, బాక్సీ జాకెట్లు, లాంగ్‌ కోట్లు, లేయర్డ్‌ దుస్తులను ప్రదర్శించారు రీనా సింగ్‌. డిజైన్లలో సున్నితమైన లేస్, వెడల్పాటి పొరలు, ఉన్ని ఫ్లాయిడ్, ఆర్గన్జా ఆప్లిక్‌ వర్క్‌ కనిపిస్తాయి. అల్లికలు, రంగుల మిశ్రమంతో ఈ డిజైన్స్‌ ఉంటాయి.

ఢిల్లీ ఫ్యాషన్‌ డిజైనర్‌ రీనా సింగ్‌ ‘ఎకా’ లేబుల్‌తో ఈ ఏడాది లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ వేదిక మీద తెలంగాణ చేనేత కారులు రూపొందించిన ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన కలెక్షన్‌నుప్రదర్శించి, కనువిందు చేశారు. తన డిజైనర్‌ దుస్తుల గురించి ప్రస్తావిస్తూ – ‘19వశతాబ్దిలో అమెరికా రచయిత్రి లూయిసా మే అల్కాట్స్‌ నవల ‘లిటిల్‌ ఉమెన్‌’లోని జో మార్చ్‌ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ డిజైన్స్‌ చేశాను. టామ్‌బాయ్‌ నుంచి సంపూర్ణ స్త్రీగా మారిన జో మార్చ్‌ ఈ డిజైన్స్‌కి ప్రేరణ. నా డిజైన్స్‌కి అంతర్జాతీయ మార్కెట్‌ రావాలి. దాంట్లో భాగంగా తెలంగాణ చేనేతల గురించి తెలుసుకున్నాను. డబుల్, సింగల్‌ ఇకత్‌ కోసం తెలంగాణలోని కోవలగూడెం, టస్సర్‌ సిల్క్‌కి మహదేవ్‌పూర్, కాటన్‌ ఫ్యాబ్రిక్‌కి నారాయణ్‌పేట్‌ ప్రాంతాల నేతకారులను కలిశాను. తెలంగాణ పొడి వాతావరణం కనుక ఇక్కడ సిల్క్‌ కాటన్‌తో మిక్స్‌ చేసిన ఫ్యాబ్రిక్‌ ప్రధానంగా ఉంటుంది. స్పన్‌ సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ మందంగా ఉంటుంది. అందుకని మూలాంశం దెబ్బతినకుండా పట్టు, పత్తి ట్విస్టెడ్‌ దారాలకు డైయింగ్‌ చేసి నేయడంతో వీటికి మరింత వన్నె వచ్చింది. ఫ్యాషన్‌ పరిశ్రమలో అతి పెద్ద కాలుష్యకారకాలు దుస్తులే. ఈ రోజు మోడల్‌ రేపటికి పాతదైపోతుంది. డిజైన్స్‌ అందుకు వాడే ఫాబ్రిక్‌ ప్రతి సీజన్‌లోనూ ధరించేలా ఉండాలి. ఈ తరహా వస్త్రాలను ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో మరింత కృషి చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు రీనా సింగ్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా