పాశుర ప్రభాతం

18 Dec, 2017 00:39 IST|Sakshi

3వ పాశురం
‘‘ఓజ్గియులగళన్ద ఉత్తమన్‌ పేర్‌పాడి, నాఙళ్‌ నంబావైక్కువచ్చాత్తి నీరాడినాల్, తీజ్గిన్ని నాడెల్లామ్‌ తిఙ్జళ్‌ ముమ్మారిపెయ్‌దు ఓఙ్గు పెరుంశెన్నెల్‌ ఊడుకయలుగళ పూఙువళైప్పొదిల్‌ పొరివండు కణ్‌పడుప్ప తేఙ్గాదే పుక్కిరిన్దు శీర్‌త్త్తములై పత్తి వాఙ్గకుడమ్‌ నిఱైక్కుమ్‌ వళ్ళళ్‌ పెరుమ్‌ పశుక్కళ్‌ నీఙ్గాద శెల్వమ్‌ నిఱైన్దేలో రెమ్బావాయ్‌’’
భావం: బలి చక్రవర్తి దానంగా ఇచ్చిన మూడు అడుగుల నేలను కొలిచే నిమిత్తం, పెరిగి పెరిగి ఆకాశం వరకు వ్యాపించిన ఉత్తముడైన త్రివిక్రముని నామాలను కీర్తించెదము.  మేము వ్రతము అనే మిష (సాకు) తో మార్గళి స్నానము చేసినచో లోకమంతా ఆనందించును. 

ఈతిబాధలు లేకుండా నెలకు మూడు వానలు పడవలెను.  దేశమంతా సుఖంగా ఉండవలెను.  పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండును. పూచిన కలువలలో అందమైన తుమ్మెదలు నిద్రించుచుండును. పాడిపంటలు సమృద్ధిగా ఉండును. పశువుల కొట్టంలో స్థిరంగా కూర్చుండి పొదుగును పట్టగానే కుండలు నిండునట్లుగా పాలధారలను కురిపించు గోవులు అధిక సంఖ్యలో ఉండవలెను.  తరగని సంపద లోకులకు ఉండవలెను.
– ఎస్‌. శ్రీప్రియ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు