దర్భశయన రాముడు... పెళ్లి చేసే దేవుడు

27 Aug, 2017 01:07 IST|Sakshi
దర్భశయన రాముడు... పెళ్లి చేసే దేవుడు

ఏ ఆలయంలోనైనా దేవుళ్లని నిలబడిన భంగిమలో లేదా కూర్చున్న భంగిమలో దర్శించుకోవడం సాధారణం. కానీ, దర్భశయనంలో మాత్రం శయనించిన శ్రీరాముని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం రామేశ్వరానికి సుమారు 60 కి.మీ. దూరంలో రామనా«థపురానికి 8 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి రాముడిని స్థానికంగా ‘తిరుపుల్లవి’ అంటారు. తిరుపల్‌ అని అనే తమిళపదానికి గడ్డితో(దర్భలతో) చేసిన శయ్య అని అర్థం. (తమిళంలో పుల్‌ అంటే గడ్డి అని, అనై అంటే శయ్య అని అర్థం). ఒకప్పుడు దర్భలతో నిండిన దట్టమైన అడవి ఉండేదని, దాన్ని ‘పుల్లారణ్య’ అనేవారని చెబుతారు.

ఈ రాముడు కళ్యాణ జగన్నాథుడు: ప్రత్యేకించి వివాహలు కావాల్సిన వారికోసం ఇక్కడ దర్భశయనంలో కల్యాణ జగన్నాథుని ప్రతిష్టించారు. అదేవిధంగా సంతానం కోసం సంతాన వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు. పెళ్లి కావలసిన యువతీయువకులు దర్భశయనం వెళ్లి స్వామిని దర్శించుకొని కల్యాణ కుంకుమను తెచ్చుకుని 45 రోజులపాటు ప్రతిరోజూ నుదుట ధరిస్తే  వివాహం కుదురుతుందని విశ్వాసం.

మరిన్ని వార్తలు