మందుల కారణంగా  మధుమేహ సమస్యలు తీవ్రం!

16 Nov, 2018 00:32 IST|Sakshi

మధుమేహ చికిత్స కోసం వాడే కొన్ని రకాల మందులు... కీటో అసిడోసిస్‌ అనే రుగ్మతకు.. తద్వారా కాలి దిగువ భాగాలను తొలగించాల్సిన పరిస్థితులకు దారితీస్తున్టన్లు బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించింది. మధుమేహ చికిత్సలో సోడియం గ్లూకోజ్‌ కోట్రాన్స్‌పోర్టర్‌ (ఎస్‌జీఎల్‌టీ2) బహుళ ప్రాచుర్యం పొందిందని, మూత్ర పిండాల ద్వారా చక్కెరలను శరీరం వెలుపలకు పంపేందుకు ఇవి సహకరిస్తాయి. అయితే ఈ మందులు సురక్షితమైనవేనా అన్న అంశంపై తొలి నుంచి సందేహాలు ఉన్నాయి.

మూత్రపిండాలకు నష్టం మొదలుకొని ఎముకలు తొందరగా విరిగిపోవడం వల్లకు అనే దుష్ప్రభావాలకు ఇదికారణమని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అంతరాŠఝతీయ శాస్త్రవేత్తల బందం ఒకటి స్వీడన్, డెన్మార్క్‌లకు చెందిన వేల మంది మధుమేహులపై ఒక పరిశోధన చేపట్టింది. 2003 – 2016 మధ్యకాలంలో ఎస్‌జీఎల్‌టీ2 మందు వాడేవారిని, జీఎల్‌పీ1 మందు వాడేవారిని పోల్చి చూసింది. మిగిలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఎస్‌జీఎల్‌టీ2 మందు తీసుకునే వారికి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.  

>
మరిన్ని వార్తలు