ఆరని కన్నీటి బొట్టు!

6 Sep, 2015 14:40 IST|Sakshi
ఆరని కన్నీటి బొట్టు!

సెప్టెంబర్ 6, 1997

 

డయానా అంటే.. సుందరరూపమే కాదు... చల్లటి దయాగుణం కూడా.
 ‘డయానా చనిపోయింది’ అనే వార్త ఒక దేశానికి సంబంధించిన విషాదం మాత్రమే కాలేకపోయింది... అది విశ్వవ్యాప్త విషాదంగా మారిపోయింది.
 బాగా తెలిసిన అమ్మాయి చనిపోయింది అనే భావనేగానీ, ‘అక్కడెక్కడో బ్రిటన్ యువరాణి చనిపోయిందట’ అని ఎవరూ అనుకోలేదు.
  ఈరోజు... లండన్‌లో డయానా అంత్యక్రియల వెంట నడిచింది ప్రపంచం. ఎక్కడికక్కడ కన్నీటి వర్షం. వెక్కిళ్ల శబ్దాలు వినబడొద్దు అన్నట్లుగా మోగుతున్న టెనోర్ గంట. ‘ఈ రాచరికపు ఆడంబరం వద్దు’ అన్నట్లుగా కెన్సింగ్‌టన్ ప్యాలెస్ వైపు చూస్తున్న డయాన నిర్జీవ నేత్రాలు!
 ‘అందరితో పాటు గుంపులో  నడుస్తున్నాను నేను... కానీ ఒంటరిగా’ డయానాకు ఇష్టమై ఈ కవితావాక్యం వెస్ట్‌మినిస్టర్ ఎబెకు వెళ్లే అన్ని దారులలో కన్నీటి శబ్దాల మధ్య వినిపిస్తూనే ఉంది... ఇప్పటికీ!
 

 

మరిన్ని వార్తలు