పిల్లలు పండ్లు, పాలు తీసుకోవడం లేదా? 

10 Apr, 2018 00:39 IST|Sakshi

దాదాపు ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లలు కూరగాయలు, పండ్లు, పాలు తీసుకోడానికి ఇష్టపడకపోవడం చాలా సాధారణం. వాళ్లు అలా పౌష్టికాహారం  తినకుండా, పాలు తాగకుండా మారాం చేస్తుంటే... ఈ కింది సూచనలు పాటించండి. ఉదాహరణకు పండ్లు తినకపోతే...  వాటిని ఫ్రూట్‌ సలాడ్స్‌గా ఇవ్వడమో లేదా కస్టర్డ్‌తో కలిపి పెట్టడమో చేయండి. కొన్ని సందర్భాల్లో పండ్లను జ్యూస్‌గా తీసి ఇవ్వవచ్చు. ఇక పాలు తాగకపోతే మిల్క్‌షేక్‌గా రూపంలో ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్లు పెట్టండి. కూరగాయలు తినకపోతే... వెజిటెబుల్‌ ఆమ్లెట్, గ్రిల్డ్‌ వెజిటెబుల్‌ శాండ్‌విచ్‌... ఇలా రకరకాలుగా ఇవ్వండి.

ఒకవేళ వాళ్లు నూడుల్స్‌ ఇష్టంగా తింటుంటే, వాటికే రకరకాల కూరల ముక్కలు కలిపి తయారు చేయండి. ఎదిగే పిల్లలకు మాంసాహారం, చేపలూ (తినేవారైతే), లెగ్యూమ్స్‌ (పప్పులు / దాల్స్‌), బాదాం, జీడిపప్పు, వాల్‌నట్‌ వంటి నట్స్‌ తప్పక ఇవ్వాలి. వల్ల వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. దాంతో ఆ వయసు పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే పిల్లలు కాస్త పెద్దయాక వాళ్లకు ఆటల రూపంలో కాస్త వ్యాయామం అందేలా చూడాలి.  

మరిన్ని వార్తలు