స్ట్రెస్‌ పెంచుకోకండి...  జుట్టు రాల్చుకోకండి!

31 Dec, 2017 00:48 IST|Sakshi

జుట్టు మీద ఒత్తిడి గణనీయమైన ప్రభావం చూపుతుంది. మనలో ఇలా స్ట్రెస్‌ (ఒత్తిడి) పెరగగానే రాలే వెంట్రుకల సంఖ్య కూడా అలా పెరిగిపోతుంది. అది శారీరకమైనా లేదా మానసికమైనా మనలో స్ట్రెస్‌ కలగగానే... అది జుట్టును టెలోజెన్‌ ఎఫ్లూవియమ్‌ అనే దశలోకి తీసుకెళ్తుంది. ఈ దశలో వెంట్రుక రాలి, నిద్రాణ స్థితిలోకి వెళ్తుంది. ఒత్తిడి సమయంలో ఈ టెలోజెన్‌ ఎఫ్లూవియమ్‌ చాలా సుదీర్ధకాలంపాటు కొనసాగుతుంది. అలా దువ్వుకుంటున్నా లేదా స్నానం చేస్తున్నా సరే... ఒత్తిడి సమయంలో దాని వల్ల రాలే వెంట్రుకల సంఖ్య మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది.

టెన్షన్, భరించలేనంత ఒంటరితనం, నిరాశ, నిస్పృహ వంటి ఫ్రస్టేషన్‌ లక్షణాలు మనలో ఒత్తిడిని పెంచి, జుట్టును రాల్చేస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన   ఆశాజనకమైన విషయం ఒకటి ఉంది. ఒత్తిడి వల్ల జుట్టురాలడంతో మనకు కలిగే హెయిర్‌లాస్‌ శాశ్వతం కాదు. మనం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నపూర్వకంగా ఒత్తిడిని అధిగమించగలిగితే మనం కోల్పోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. 

మరిన్ని వార్తలు