వీరి సేవను గుర్తుచేసుకుందామా?

5 Apr, 2018 00:17 IST|Sakshi

సెల్ఫ్‌ చెక్‌

భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళలు పురుషులతో సమానంగా సేవలందించారు. భరతమాత కోసం వాళ్లు చేసిన సాహసాలలో కొన్నింటిని గుర్తు చేసుకుందాం.

1.    బ్రిటిష్‌ పాలన విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహిళ ఝాన్సీలక్ష్మీబాయ్, తర్వాత తరం పోరాటయోధులకు ఆమె స్ఫూర్తి. 
    ఎ. అవును     బి. కాదు 

2.    సరోజినీనాయుడు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి సమావేశంలో బ్రిటిష్‌ విధానాలను బాహాటంగా విమర్శించారు. 
    ఎ. అవును     బి. కాదు 

3. బ్రిటిష్‌ ప్రభుత్వం సీనియర్‌ నాయకులను అరెస్ట్‌ చేయడంతో అరుణా అసఫ్‌ అలీ కాంగ్రెస్‌ పతాకాన్ని ఎగురవేసి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 
    ఎ. అవును     బి. కాదు 

4. ఇందిరాగాంధీ స్వాతంత్య్ర సమరంలో నాయకులకు  సహాయం అందించడం  కోసం తోటి పిల్లలతో ‘వానరసేన’ అనే బృందాన్ని తయారు చేశారు. 
    ఎ. అవును     బి. కాదు 

5.    కమలానెహ్రూ మద్యానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారని మీరు చదివారు. 
    ఎ. అవును     బి. కాదు 

6.    మేడమ్‌ సామా మన జెండాని జర్మనీలో ఎగురవేశారు. 
    ఎ. అవును     బి. కాదు 

7.    మొదటి స్వాతంత్య్ర పోరాటం సమయంలో బేగమ్‌ హజ్రత్‌ మహల్‌ – బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్‌ నిర్వహించినట్లు మీకు తెలుసు. ఆమె గౌరవార్థం ఇండియా 1984లో స్టాంపును విడుదల చేసింది.
    ఎ. అవును     బి. కాదు 

8.    విదేశీయురాలైన అనిబిసెంట్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ. 
    ఎ. అవును     బి. కాదు  

9.    కస్తూర్బా స్వాతంత్రోద్యమంలో గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే తన ఉద్యమం అన్నట్లుగా పనిచేశారనీ, గాంధీజీ జైలుపాలైనప్పుడు ఉద్యమాలను తానే స్వయంగా నడిపించారని తెలుసు.
    ఎ. అవును     బి. కాదు 

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే స్వాతంత్రోద్యమం పైనా, అందులో  మహిళల భాగస్వామ్యం పైనా మీకు తగినంత పరిజ్ఞానం ఉంది.  

మరిన్ని వార్తలు