మీకు సోషల్‌ ఫోబియానా ?

19 Jun, 2017 23:32 IST|Sakshi
మీకు సోషల్‌ ఫోబియానా ?

సెల్ఫ్‌చెక్‌

మానవ నాగరికతలో ఒక మెట్టు సంఘజీవనం. అభివృద్ధి చెందుతున్న సొసైటీలో కొందరు మాట్లాడటానికి భయపడతారు. ఒకమూల కూర్చొని అదే ప్రపంచం అనుకుంటారు. సోషల్‌ స్కిల్స్‌ లేకుండా, ఆందోళనతో ఉంటారు. తమ పనులను తాము చేసుకోవటానికి కూడ బిడియపడుతుంటారు. దీనినే సైకాలజీ పరిభాషలో సోషల్‌ యాంగై్జటీ డిజార్డర్‌ అంటారు. మీరూ ఈ సమస్యతో బాధపడుతున్నారా?

1.    కొత్తవారిని కలవాలంటే చాలా భయపడతారు.
ఎ. కాదు     బి. అవును

2.    చాలా తక్కువగా మాట్లాడతారు. ఆత్మవిశ్వాసం ఉండదు.
ఎ. కాదు     బి. అవును

3.    స్టేజ్‌ ఫియర్‌ చాలా ఎక్కువ, మైక్‌లో మాట్లాడాలంటే ఆందోళన చెందుతారు.
ఎ. కాదు     బి. అవును

4.    విమర్శలంటే చాలా భయం. బిడియం వల్ల అప్పుడప్పుడు మీ శరీరం వణుకుతుంది.
ఎ. కాదు     బి. అవును

5.    మాటల మధ్యలో మీ నోరు పొడిబారిపోతుంది.
ఎ. కాదు     బి. అవును

6.    ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తడబడుతుంది.
ఎ. కాదు     బి. అవును

7.    ఎవరెంత బతిమాలినా ఇంటినుంచి బయటకు కదలరు.
ఎ. కాదు     బి. అవును

8.    మిమ్మల్నే అందరూ గమనిస్తున్నారన్న అనుమానం మిమ్మల్ని వెంటాడుతుంది.
ఎ. కాదు     బి. అవును

9.    తరచు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. సంతోషం మీ జీవితంలో చాలా తక్కువగా ఉంటుంది.
ఎ. కాదు     బి. అవును

10.    భయంతో చెమటలు పడతాయి. ఎక్కువ సిగ్గుపడతారు.
ఎ. కాదు     బి. అవును

‘బి’ లు ఏడు దాటితే మీకు సమాజమంటే భయం. వ్యక్తులతో కలవాలన్నా, కలసి పనిచేయాలన్నా చాలా బిడియ పడతారని అర్థం. ఇలాంటి లక్షణాన్ని వెంటనే వదిలేయండి. సొసైటీకి దూరంగా మీరేమీ చేయలేరని గ్రహించండి. అవసరమైతే సైకాలజిస్ట్‌ సేవలు పొందండి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీకు సోషల్‌ ఫోబియా లేదని అర్థం.

మరిన్ని వార్తలు