అడ్మినిస్ట్రేషన్‌ స్కిల్‌ (పాలనా నైపుణ్యం) మీలో ఉందా?

7 Oct, 2018 05:50 IST|Sakshi

అడ్మినిస్ట్రేషన్‌ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారా?

కంపెనీ లాభాల బాటలో నడవటానికి పరిపాలనా విభాగం సరిగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్‌ స్కిల్‌ ఉన్నవారు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించటంతో పాటు, ఉద్యోగులందరిలో పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ను కలిగిస్తారు. సమన్వయంతో ఉంటూ, ఉద్యోగస్తులందరిలో స్ఫూర్తిని నింపుతారు. ఆపదలో కంపెనీకి అండగా నిలుస్తారు. అడ్మినిస్ట్రేషన్‌ ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేక గుడ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకుంటున్నారా? పరిపాలనా నైపుణ్యం మీలో ఎలా ఉందో తెలుసుకోండి.

1.     మీ దగ్గరకొచ్చేవారి పేర్లను బాగా గుర్తుంచుకుంటారు. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. (సిగరెట్‌ తాగటం, చూయింగ్‌ గమ్‌ నమలటం, మాటలకు అడ్డురావటం లాంటివి చేయరు).
    ఎ. కాదు     బి. అవును

2. సమయపాలనను అనుసరిస్తారు. ఇలానే ఉద్యోగులందరూ ఉండాలని సూచిస్తారు. ప్రొఫెషనల్‌గా డ్రెస్‌ చేసుకుంటారు. ఉద్యోగు లందరితో స్నేహభావంతో ఉంటారు.
    ఎ. కాదు     బి. అవును

3.     వృత్తిలో జాగరూకతతో ఉంటారు. ఎటువంటి తప్పులకు తావివ్వరు. పాలనా పరమైన అంశాలను సమర్థంగా నిర్వహిస్తారు.
    ఎ. కాదు     బి. అవును

4.     వినయంగా ఉంటారు. ఆచితూచి మాట్లాడతారు. సమయస్ఫూర్తితో మెలుగుతారు.
    ఎ. కాదు     బి. అవును

5.    వ్యక్తిగత సమస్యలను ఆఫీసు దాకా తీసుకు రారు. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటారు.
    ఎ. కాదు     బి. అవును

6.     వృత్తిలో పారదర్శకత చూపిస్తారు. తోటివారి సలహాలు సూచనలు అవలంబిస్తారు. వారిని కించపరచరు. క్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలరు.
    ఎ. కాదు     బి. అవును


7.     ప్రతిమాటని ఆలోచించి మాట్లాడతారు. మీపై గౌరవం పెరగటానికి ఇది చాలా ముఖ్యమని మీకు తెలుసు. ఇదేవిధంగా మీటింగ్‌లలో మాట్లాడతారు.
    ఎ. కాదు     బి. అవును

8.     ఓపిక, దయ, జాలి, క్షమల ద్వారా సహనాన్ని పొందుతారు. ఈ విధంగా అడ్మినిస్ట్రేష¯Œ ని సమర్థవంతంగా నిర్వహిస్తారు.
    ఎ. కాదు     బి. అవును

9.     పనిచేస్తున్న సంస్థ పట్ల చాలా విశ్వాసంగా, నిజాయితీగా ఉంటారు. అవిశ్వాసం మీ కెరియర్‌ని మెరుగుపరచదని మీరు గ్రహిస్తారు.
    ఎ. కాదు     బి. అవును

10. వృత్తిని ఇష్టంగా చేస్తారు. చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. సెన్సాఫ్‌ హ్యూమర్‌ మీలో ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలరు.
    ఎ. కాదు     బి. అవును

‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో పాలనా నైపుణ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. మీలో ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల ఎక్కడకు వెళ్లినా పేరు తెచ్చుకుంటుంటారు. మేనేజ్‌మెంట్‌ దృష్టిలో గుర్తింపు పొందుతారు. సాటి ఉద్యోగుల దగ్గర మన్ననలు పొందుతారు. ఈ ఆటిట్యూడ్‌ మీ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, ఆర్థికంగా బలపరచటానికి కూడ ఉపయోగపడుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే మీకు అడ్మినిస్ట్రేషన్‌ స్కిల్‌ లేదనే చెప్పాలి. ఇతరులమీద ఆధార పడటమే కాని స్వతంత్రంగా వ్యవహరించటం మీకు తెలియదు. ‘బి’ లను సూచనలుగా భావించి పాలనా నైపుణ్యం ఎలా పొందవచ్చో తెలుసుకోండి.

మరిన్ని వార్తలు