ఉన్నతంగా ఎదిగే శక్తి మీలో ఉందా?

15 Jun, 2017 23:14 IST|Sakshi
ఉన్నతంగా ఎదిగే శక్తి మీలో ఉందా?

సెల్ఫ్‌ చెక్‌

వివిధ రకాల వృత్తులలో ఉన్నవారు వారి ప్రత్యేకత నిలుపుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అనుకున్నది సాధించేవరకు పోరాడుతూనే ఉంటారు. ఉన్నతంగా ఎదగటానికి అవసరమైన శక్తియుక్తులు మీలో ఉన్నాయోలేవో తెలుసుకోండి.

1.    ప్రస్తుతం మీరు సాధించినదానికన్నా ఉన్నతంగా ఎదగాలని పట్టుదలగా ఉన్నారు.
ఎ. కాదు     బి. అవును

2.    ఇతరుల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు.
ఎ. కాదు     బి. అవును

3.    అన్ని విషయాల్లో ఇతరులకన్నా ప్రత్యేకంగా కనిపించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తారు.
ఎ. కాదు     బి. అవును

4.    ఏపనినైనా ఏకాగ్రతతో చేస్తారు.
ఎ. కాదు     బి. అవును

5.    సాధించినవాటి పట్ల తేలికగా సంతృప్తి చెందరు.
ఎ. అవును     బి. కాదు

6.    మిమ్మల్ని వ్యతిరేకించేవారిపై ద్వేషభావాన్ని పెంచుకోరు.
ఎ. కాదు     బి. అవును

7.   లక్ష్యాలు సాధించేందుకు నిత్యం శ్రమిస్తుంటారు.
ఎ. కాదు     బి. అవును

8.    అవకాశాలను ఏమాత్రం వదులుకోరు.
ఎ. కాదు     బి. అవును

9.    కొత్తవిషయాలు నేర్చుకోటానికి ముందుంటారు.
ఎ. కాదు     బి. అవును

10.    సందర్భానుసారం ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలో మెచ్యూరిటీ కనిపిస్తుంది.
ఎ. కాదు     బి. అవును

‘బి’ లు ఏడు దాటితే కెరియర్‌లో దూసుకుపోవటానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు మీలో ఉన్నట్లే. ‘ఎ’ లు ‘బి’ ల కంటే ఎక్కువగా వస్తే జీవితంలో పైకి రావటానికి మీరింకా కృషి చేయాలని అర్థం.

మరిన్ని వార్తలు