టబ్బీలా ఉండి పోవాలి!

28 Apr, 2016 22:44 IST|Sakshi
టబ్బీలా ఉండి పోవాలి!

2011లో ప్లాస్టిక్ సీసాల సేకరణ 26 వేల మైలురాయిని చేరిన సందర్భంగా టబ్బీ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో నమోదైంది. చనిపోయే నాటికి  50 వేల ప్లాస్టిక్ సీసాలను సేకరించింది. టబ్బీ పేరును నమోదు చేయడం సంతోషకరమైన సంఘటన అని అప్పుడు గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధి హర్షం వ్యక్తం చేశారు. జీవితకాలమంతా పర్యావరణ హితం కోసమే శ్రమించిన ప్రాణి టబ్బీ అని, ఎక్కడ వృథాగా కార్బన్ ముక్క కనిపించినా ఏరి తెచ్చేదని స్థానిక వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ మేనేజర్ సైనాన్ ఎడ్డర్డ్స్ ‘వరల్డ్స్ గ్రీనెస్ట్ డాగ్’ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరమూ కనీసం ఒక్క మంచి పని అయినా చేయాలి. మనం పోయినప్పుడు చెప్పుకోవడానికి ఆ పని మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. పోయే లోపు... ఇలా టబ్బీలా పదిమందికి పనికొచ్చే పని చేసి పోవాలి.

మరిన్ని వార్తలు