హార్డ్‌డిస్క్‌లకు  కాలం చెల్లినట్లేనా?

9 Aug, 2018 00:45 IST|Sakshi

కంప్యూటర్లు, ల్యాప్‌టాపలలో బోలెడంత బరువుండే హార్డ్‌ డిస్క్‌లకు ఇక కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఎందుకంటారా? శ్యాంసంగ్‌ కంపెనీ ఏకంగా నాలుగు టెరాబైట్ల సమాచారాన్ని ఇముడ్చుకోగల మెమరీ కార్డును ఆవిష్కరించింది మరీ! అంతేకాదు.. ఈ మెమరీ డివైజ్‌లోకి ఏదైనా ఫైల్‌ను నిక్షిప్తం చేయడం కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. సెకనుకు 540 మెగాబిట్ల వేగంతో ఫైళ్లను చదవడం.. 520 మెగాబిట్ల వేగంతో రాయడం చేస్తుంది ఈ మెమరీ కార్డు. ఇంకోలా చెప్పాలంటే ఒకే రెండు సెకన్లలో ఓ మోస్తరు హెచ్‌డీ సినిమా మొత్తాన్ని స్టోర్‌ చేసేసుకోవచ్చు.

ఒక్కో మెమరీ సెల్‌లో తాము మూడు స్థానంలో నాలుగు బిట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయగలిగామని ఇందుకోసం మూడు బిట్ల ఎస్‌ఎస్‌డీ కంట్రోలర్, టర్బోరైట్‌ టెక్నాలజీలను వాడామని శాంసంగ్‌ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ మెమరీ కార్డులో 64 పొరలున్న వీ–ఎన్‌ఏఎన్‌డీ మైక్రోప్రాసెసర్లు 32 వాడామని ఫలితంగా ఇతర నాలుగు టెరాబైట్ల సామర్థ్యం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయగలదని చెప్పారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 2.5 అంగుళాల సైజు డ్రైవ్‌లకు కొత్త 4 టెరాబైట్ల మెమరీకార్డు తోడవనుందని.. ఇదే టెక్నాలజీతో తాము స్మార్ట్‌ఫోన్లలోనూ మెమరీ సామర్థ్యాన్ని పెంచగలమని శాంసంగ్‌ చెబుతోంది!


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా