నాలుక్కాళ్ల యాంటీ డిప్రెసెంట్‌!

1 May, 2017 23:36 IST|Sakshi
నాలుక్కాళ్ల యాంటీ డిప్రెసెంట్‌!

డాగ్‌టర్‌

పెట్‌డాగ్స్‌ ఇంటికే కాదు... వొంటికి కూడా కాపలానే. శారీరక, మానసిక అనారోగ్యాలు దరి చేరకుండా యజమానులను కాపాడుతుంటాయి. పెట్స్‌ను పెంచుకోవడం వల్ల డిప్రెషన్‌ దూరం అవుతుందని, బీపీ అదుపులో ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. అంతేకాదు... ఇంటిలో కుక్క ఉంటే యాంటీ డిప్రెసెంట్లు వాడవలసిన అవసరమే ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే పెట్‌ డాగ్‌... నాలుగు కాళ్ల యాంటీ డిప్రెసెంట్‌ అన్నమాట.  ఇప్పుడు మానసిక వ్యాధుల చికిత్సలో అంటే నర్సింగ్‌ హోమ్స్‌లో దీర్ఘకాలిక చికిత్స తీసుకునే వాళ్లకోసం విజిటింగ్‌ డాగ్‌టర్స్‌ వస్తున్నాయి. మానసిక సమస్యలతో బాధపడే పిల్లలను రోజూ కాసేపు నిర్ణీత సమయంలో పెట్‌డాగ్స్‌తో ఆడుకోనిచ్చే ఒక థెరపీ సెషన్‌నే ప్రారంభించేశారు మానసిక వైద్యులు.

ఈ సంసార జంఝాటం మాకొద్దు.. మేమిప్పుడప్పుడే పెళ్లి చేసుకోం అనీ, అసలు  పెళ్లే వద్దు అనీ భీష్మించుకునే ముదురు ‘బ్రహ్మచారి’ణులకు పెట్‌డాగ్స్‌ను ప్రెజెంట్‌ చేస్తే చాలు.. బుద్ధిగా దారిలోకొచ్చేస్తారట. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు పెట్‌డాగ్‌ తోడుంటే చాలు.. వాళ్లు మరికొంతకాలం హాయిగా బతికేస్తారట.  సామాజిక కార్యకర్తలలా పెట్‌డాగ్స్‌ కూడా సామాజిక శ్రేయోభిలాషులలా కృషి చేస్తాయి.

మరిన్ని వార్తలు