అన్నిసార్లొద్దు

8 Dec, 2019 00:01 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌

పెద్ద మనుషులు / చిన్న విషయాలు

అమెరికాలో వాటర్‌ ప్రాబ్లమ్‌! అవును. అమెరికాలోనే. అమెరికాలో ఓసారెప్పుడో కరెంట్‌ పోయింది. అప్పుడూ ఇంతే.. అమెరికాలో కరెంటు పోయిందా అని ముక్కుమీద వేలేసుకున్నాం. అమెరికా ఆకాశంలో ఎక్కడో లేదు. ఈ భూమి మీదే ఉంది. అమెరికన్‌లు ఎవరో కాదు. మనలా మానవులే. ఆ మానవుల్లో అతి మామూలు మానవుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడు అయితే కావచ్చు. అతడి బాత్రూమ్‌లోనూ ట్యాప్‌లోంచి ఈమధ్య నీళ్లు రాలేదు! సిస్టమ్‌ ఎక్కడో దెబ్బతినిందని ట్రంప్‌కి అర్థమైంది.

బాత్రూమ్‌ సిస్టమ్‌ కాదు. అమెరికన్‌ వాటర్‌ సేవింగ్‌ సిస్టమ్‌. వెంటనే ఒక ఆర్డర్‌ జారీ చేసి.. వాష్‌రూమ్‌లకు వెళ్లేవాళ్లంతా పనైపోయాక ట్యాప్‌ కట్టేయాలని సర్క్యులర్‌ జారీ చేయించారు. అమెరికన్‌లు ఒకసారి టాయ్‌లెట్‌కి వెళితే పదిసార్లు ఫ్లష్‌ కొట్టి వస్తారని, ఆ పాడు అలవాటు ఎంత త్వరగా మానుకుంటే అంత త్వరగా అమెరికాలో నీటి కొరత తీరుతుందని కూడా ట్రంప్‌ చిన్న టిప్‌ కూడా ఇచ్చారు. అలాగే ఇంకో టిప్‌ కూడా. సింకులూ, షవర్‌లు వాటర్‌ని వృథాగా పోనివ్వకుండా కొత్తవాటిని బిగించుకోవాలి– అని!!

మరిన్ని వార్తలు