చేతులే చంచాలు

25 May, 2020 00:38 IST|Sakshi

సాహిత్య మరమరాలు

దామోదరం సంజీవయ్య సాహితీ మిత్రుల్లో రావూరి భరద్వాజ ఒకరు. ఇద్దరూ జీవితంలో అట్టడుగు నుంచి స్వశక్తితో స్వయంప్రకాశకులుగా ఎదిగినవారే. ఒకర్నొకరు వరుసలతో పిలుచుకునేవారు. ఓసారి సంజీవయ్య మంత్రిగా ఉన్నప్పుడు భరద్వాజ ఇంట్లో నేలపై కూర్చుని ఇద్దరూ భోంచేస్తున్నారు. బెల్లం వేసి వండిన బియ్యపు పాయసాన్ని పళ్లెంలో వడ్డించారు. దాన్ని ఎంతో ఇష్టంగా చేతిలో వేసుకుని తింటున్న సంజీవయ్యతో, ‘పళ్లెంలో స్పూన్‌ ఉంది, దానితో తిను బావా’ అని భరద్వాజ అన్నారు. ‘ఉందిలేవయ్యా నీకొక స్పూనూ! మట్టి మూకుడులో తిన్నవాడికి ఇవేమీ అక్కర్లేదు’ అంటూ సంజీవయ్య విసుర్లాడారు. ‘నీకు దేవుడు మూకుడైనా ఇచ్చాడు. మట్టి మూకుడు కూడా కొనలేని పరిస్థితి నాది ఒకప్పుడు’ అని భరద్వాజ అన్నారు. ఇద్దరూ అట్లా ఒకర్నొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. - డాక్టర్‌ శ్రీనివాసులు దాసరి 

మరిన్ని వార్తలు