పాత చీర కొత్త డ్రెస్‌

19 Jan, 2018 00:34 IST|Sakshi

స్యూ లుక్‌

అమ్మ, అమ్మమ్మల చీరలను లంగ, జాకెట్టులుగా అమ్మాయిలకు రూపొందించడం తెలిసిందే! ఈ కాలం అమ్మాయిల ఆలోచనలకు తగ్గట్టు పాత చీరలను ఇలా లాంగ్‌ అనార్కలీ, వెస్ట్రన్‌ లాంగ్‌ ఫ్రాక్‌లుగా రూపొందిస్తే కొత్తగా వెలిగిపోతాయి. ఇలాంటి డ్రెస్సులు సంప్రదాయ వేడుకల్లో స్టైల్‌గా మెరిసిపోతాయి.  ఇందుకు పట్టు, చేనేత చీరలను ఎంచుకోవాలి.  ఎంచుకున్న శారీని ఏ తరహా డ్రెస్‌గా రూçపకల్పన చేసుకుంటే బాగుంటుందో ముందుగా నిర్ణయించుకోవాలి. లాంగ్‌ అనార్కలీలు, గౌన్లు ఇప్పుడు ఫ్యాషన్‌లో ఉన్నాయి. అంచులు, కొంగును చేతులు, ఛాతీ భాగాలకు తీసుకోవాలి. అంచు భాగం ఎక్కువగా ఉండి మిగిలిపోయే అవకాశం ఎక్కువ. ఇలాంటప్పుడు ఫ్రంట్‌ ఓపెన్‌ డ్రెస్‌గా మలుచుకొని, అంచు భాగాన్ని జత చేయాలి.

ఈ ఫ్రాక్‌కి కాంట్రాస్ట్‌ లెగ్గింగ్, చుడీని జత చేస్తే చాలు. ఈ కాలానికి తగ్గట్టు పార్టీ వేర్‌ డ్రెస్‌ రెడీ! కేవలం చీర కొంగును మాత్రమే తీసుకొని, దీంతో స్టైలిష్‌ వేర్‌ని డిజైన్‌ చేసుకోవచ్చు. వెస్ట్రన్‌ పార్టీలలో ఇలాంటి డ్రెస్‌ మరింత ట్రెండీగా వెలిగిపోతుంది. రెడ్‌ కార్పెట్‌ డ్రెస్‌గా లాంగ్‌ వెస్ట్రన్‌ గౌన్‌ సెలబ్రిటీల స్పెషల్‌గా నిలుస్తుంది. ఇలాంటి డ్రెస్‌ మీ అమ్మాయికి కావాలనుకుంటే అంచు ఉన్న పాత చేనేత చీరను తీసుకొని ఇలా డిజైన్‌ చేసుకోవచ్చు. సన్నటి అంచు భాగాలను క్రాస్‌ నెక్, సైడ్స్, కింది భాగాలలో జత చేస్తే మోడ్రన్‌గా వెలిగిపోతుంది.  

మరిన్ని వార్తలు