కుదిరితే  ఓ కప్పు కాఫీ వద్దు...

19 Jan, 2019 01:44 IST|Sakshi

ఖాళీ కడుపు మీద తీసుకునే పానీయం ప్రాణం పోసేది అయి ఉండాలి. ఆరోగ్యం ఇచ్చేదిగా ఉండాలి.ఉత్సాహాన్ని పెంచేది కావాలి. శక్తిని ఇచ్చేదిగా ఉండాలి.ఎన్నో ఏళ్ల నుంచి అలవాటైన కాఫీలు, టీల కంటె...ఈ పానీయాలు ఇంట్లో వారందరికీ మార్నింగ్‌ సంజీవని కావాలి.ఇంకెందుకు ఆలస్యం...ఈ రోజు నుంచి నిద్ర లేస్తూనే ఈ ఆరోగ్య పానీయాలను సేవించడం ప్రారంభించండి...

టర్మరిక్‌ అండ్‌పెప్పర్‌ వాటర్‌
కావలసినవి: పచ్చి పసుపు కొమ్ము ముక్క – చిన్నది; 
మిరియాలు – అర టీ స్పూను; నిమ్మ చెక్క – 1 (చిన్నది); నీళ్లు – కప్పుడు

తయారీ: ∙ముందుగా కప్పుడు నీళ్లను గోరు వెచ్చన చేయాలి ∙
చిన్న నిమ్మ చెక్క, పసుపు కొమ్ము, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి, వడబోయాలి ∙గోరువెచ్చగానే తాగాలి.

ఉపయోగాలు:
►జీర్ణశక్తి మెరుగవుతుంది ∙క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది 
►రోగనిరోధక శక్తి పెరుగుతుంది

తేనె – గ్రీన్‌ టీ
కావలసినవి: నీళ్లు – ఒక కప్పు; తేనె – ఒక టీ స్పూను; 
గ్రీన్‌ టీ బ్యాగ్‌ – 1

తయారీ: ∙నీళ్లను బాగా మరిగించాలి ∙గ్రీన్‌ టీ బ్యాగ్‌ వేసి రెండు నిమిషాలు వదిలేయాలి ∙తే¯ð  జత చేసి బాగా కలపాలి ∙వేడివేడిగా గ్రీన్‌ టీ సర్వ్‌ చేయాలి.

ఉపయోగాలు: ∙గుండె ఆరోగ్యానికి మంచిది ∙కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది 
►దుర్వాసన రాకుండా నివారిస్తుంది ∙ఎముకల పటుత్వానికి మంచిది 
►చర్మసంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది ∙మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 
►జుట్టు పెరుగుతుంది ∙సాధారణ జలుబులు దరిచేరవు.

అలోవెరాఆమ్లా జ్యూస్‌
కావలసినవి: అలోవెరా జ్యూస్‌ – 5 టీస్పూన్లు (మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); ఉసిరి రసం – ఒక టీ స్పూను (మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); నీళ్లు – ఒక గ్లాసుడు

తయారీ:  ఒక గ్లాసులో నీళ్లు పోసి, అలోవెరా జ్యూస్‌ వేసి కలపాలి ∙ఆ తరవాత ఉసిరి రసం జత చేసి బాగా కలియబెట్టి, చల్లగా తాగాలి.

ఉపయోగాలు: ∙అలొవెరా, ఉసిరి రసాలు రెండూ చర్మానికి, జుట్టుకి ఉపయోగపడతాయి ∙మెటబాలిజం పెరుగుదలకు ఉపకరిస్తాయి ∙జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తాయి ∙శరీరంలో టాక్సిన్సు పేరుకుపోకుండా, కొవ్వు నిల్వ ఉండిపోకుండా చేస్తూ కొవ్వుని కరిగిస్తాయి. 

దాల్చిన చెక్క–తేనె నీళ్లు
కావలసినవి: తేనె – ఒక టేబుల్‌ స్పూను; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు, నిమ్మ రసం – అర టీ స్పూను

తయారీ:నీళ్లను మరిగించి, బాగా పొంగుతుండగా మంట ఆపేయాలి ∙దాల్చినచెక్క పొడి వేసి సుమారు పావు గంటసేపు అలాగే ఉంచేయాలి ∙చల్లారిన ఈ నీళ్లకు నిమ్మరసం, తేనె జత చేయాలి ఈ పానీయాన్ని రోజుకి రెండు సార్లు తాగాలి ∙ఉదయమే పరగడుపున ఒకసారి, రాత్రి నిద్రపోవడానికి ముందు ఒకసారి ఈ పానీయం తీసుకోవడం మంచిది.

ఉపయోగాలు
►గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి
►వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
►చర్మసంబంధిత వ్యాధులు దరిచేరవు
►మధుమేహులకు మంచిది
►బ్లాడర్‌ వ్యాధులు రాకుండా కాపాడుతుంది
►అజీర్ణవ్యాధులు దరిచేరవు
►నోటి నుండి దుర్వాసన రాదు
►శరీరానికి శక్తినిస్తుంది
►అలర్జీలు రాకుండా కాపాడుతుంది
►గొంతు సంబంధ వ్యాధులను నివారిస్తుంది
►దగ్గు, జలుబు రాకుండా కాపాడుతుంది


ఆపిల్‌  సైడర్‌వెనిగర్‌ ఇన్‌ వాటర్‌
కావలసినవి: ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ – ఒక టేబుల్‌ స్పూను; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – చిటికెడు; తేనె – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ: ముందుగా ఒక గ్లాసులోకి నీళ్లు తీసుకోవాలి ∙ఆపిల్‌ సైడర్‌ వెనిగర్, నిమ్మరసం, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టి, వడగట్టాలి ∙తేనె జత చేసి తీసుకోవాలి.

ఉపయోగాలు: ∙బ్లడ్‌ సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది 

►బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది 

►వ్యాధికారకాలను నశింపచేస్తుంది 

మరిన్ని వార్తలు