వెన్నునొప్పి తగ్గడం లేదు... పరిష్కారం చెప్పండి

16 Sep, 2019 00:43 IST|Sakshi

న్యూరో కౌన్సెలింగ్‌

నా వయసు 32 ఏళ్లు. ఒక మార్కెటింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నాను. రోజూ 60 కి.మీ. బైక్‌ మీద వెళ్తుంటాను. అలాగే కొన్ని అకౌంట్స్‌ కోసం కంప్యూటర్‌ మీద కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంటాను.  నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. నాకున్న సమస్య ఏమిటి? పరిష్కారం సూచించండి.

ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా చాలామందిలో వెన్నునొప్పులు వస్తున్నాయి. మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్‌ మీద చాలా లాంగ్‌ డ్రైవింగ్‌ చేయడం. పైగా డ్రైవింగ్‌లో చాలా ఎక్కువగా  ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మన రోడ్ల మీద గతుకులు చాలా సాధారణం. ఇలాంటి నేపథ్యంలో ఇంతింత దూరాలు టూ–వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్‌ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్‌) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అంతేకాకుండా కంప్యూటర్‌ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్‌ స్పైన్‌ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి.

►మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్‌ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి.
►కొన్ని సాధారణ వార్మ్‌అప్‌ వ్యాయామాలు చేయండి
►వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా