మునగ..!

21 Jul, 2017 23:06 IST|Sakshi
మునగ..!

గుడ్‌ఫుడ్‌

మునక్కాయను చాలామంది ఇష్టంగా తింటారు. రుచిగా ఉండే మునగతో ఆరోగ్యానికీ చాలా మేలు. మునగతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని...

మునగచెట్టు శాఖలు చాలా బలహీనంగా ఉంటాయేమోగానీ, మునగలో ఎముకలు గట్టిపడటానికి అవసరమైన క్యాల్షియమ్‌ పుష్కలంగా ఉంటుంది. మునగ ఆకుల నుంచి కాస్త రసం తీసి, పాలలో కలిపి పిల్లలకు పట్టిస్తే ఎముకలను పటిష్టం చేస్తుంది ∙ఛాతీ పట్టేసినట్లున్నా, శ్వాస తీసుకోవడం కష్టమైనా, దగ్గు రావడం, గొంతులో పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలన్నింటికీ మునగతో మంచి ఉపశమనం దొరుకుతుంది.

అందుకే ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు మునగ తినడం మంచిది  మునగ ఒంట్లోని విష పదార్థాలను క్రమంగా బయటకు పంపించే సమర్థమైన డీ–టాక్సిఫయర్‌. మునగ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ∙మునగతో గొంతు, చర్మ, ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లు  వేగంగా నయమవుతాయి. ∙ఇందులో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్న వాళ్లు మునగ ఎక్కువగా తినడం మంచిది. ∙మునగలోని విటమిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులను నివారిస్తాయి.

మరిన్ని వార్తలు