భూమాతకు వందనం!

21 Apr, 2014 22:17 IST|Sakshi
భూమాతకు వందనం!

సందర్భం
     
తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే)ను 1970 ఏప్రిల్ 22న జరుపుకున్నారు.
     
పారిశ్రామీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి మన అజాగ్రత్త...మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికన్ సెనెటర్ గేలార్డ్ నెల్సన్ ‘ఎర్త్ డే’కు రూపకల్పన చేశారు.
     
ది వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ‘డిస్నీ నేచర్’ 2009లో ‘ఎర్‌‌త’ పేరుతో చక్కని డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది.
     
 తొలి ఎర్త్‌డే (1970) రోజు అమెరికా వీధుల్లో వేలాది మంది పారిశామ్రిక విప్లవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
     
 ‘ఎర్త్ డే’ పేరును 2009లో ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే’ గా మార్చింది.
     
 ‘ఎర్త్ డే నెట్‌వర్క్స్ ఇండియా ప్రోగ్రాం’ ప్రధాన కేంద్రం కోల్‌కతాలో ఉంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, వుమెన్ అండ్ ది గ్రీన్ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్... మొదలైన విభాగాలలో ఈ సంస్థ పనిచేస్తుంది.
     
 కొన్ని దేశాల్లో ‘ఎర్త్ డే’ను వారం మొత్తం జరుపుకొంటారు.
     
 ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడానికి ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రణాళిక వేసుకున్నాడు.
     
 ఈరోజు ధరిత్రీ దినోత్సవాన్ని ఈవిధంగా జరుపుకోవచ్చు.
     
 మొక్కలను నాటండి  పిట్టల కోసం ఇంటిని నిర్మించండి  ‘రీసైక్లింగ్ సెంటర్’కు  వెళ్లండి  కారు, బైక్‌లలో కాకుండా సైకిల్ మీద ప్రయాణం చేయండి.
 

మరిన్ని వార్తలు