భూమికి దగ్గరగా పెనువిపత్తు?

22 Nov, 2018 00:47 IST|Sakshi

భూమి మొత్తాన్ని సెకన్లలో సర్వనాశనం చేయగల విపత్తు మన దగ్గరలోనే ఉందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మన పాలపుంతలోనే భూమికి దాదాపు 8000 కాంతి సంవత్సరాల దూరంలో జరుగుతున్న ఓ ఖగోళ ప్రక్రియ ఇందుకు కారణమవుతోందన్నది వారి అంచనా. అబ్బో.. అంత దూరంలో జరిగే సంఘటన మనలను ఎలా నాశనం చేస్తుందిలే అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ రెండు నక్షత్రాలు పేలిపోతున్నాయి. అందులో ఒకదాన్నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన గామా కిరణాలతో భూమి సెకన్ల వ్యవధిలో ఆవిరైపోతుందనేది శాస్త్రవేత్తల అంచనా. కీలకమైన, మనందరికీ కొంత స్వాంతన కలిగించే అంశం ఏమిటంటే... ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం ఎవరికీ తెలియదు.

సూర్యుడు తన కోటానుకోట్ల ఏళ్ల జీవితకాలంలో వెలువరించే శక్తి మొత్తం కొన్ని సెకన్లలోనే వెలువరించగల సామర్థ్యం ఈ గామా రే బరస్ట్‌లకు సాధ్యం. ఇంధనం మొత్తం ఖర్చయిపోయిన నక్షత్రం పేలిపోయే సూపర్‌నోవా ఏర్పడినప్పుడు... రెండు నక్షత్రాలు ఒకదానిలో ఒకటి లయమైనప్పుడు ఈ బరస్ట్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇవి విశ్వంలో ఏ మూలలోనో సంభవించే అవకాశం ఉంటుందని.. తాజాగా మాత్రం ఎనిమిది వేల కాంతి సంవత్సరాల దూరంలోనే గుర్తించామని బెంజిమన్‌ పోప్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఇంత దూరం ఉన్నప్పటికీ గామా రే బరస్ట్‌ ప్రభావం భూమిపై చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు