వీటితో ఆస్త్మాకు చెక్‌

16 Jul, 2018 18:25 IST|Sakshi

లండన్‌ : పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునేవారిలో ఆస్త్మా వ్యాధి దరిచేరదని, ఇప్పటికే ఆ వ్యాధి ఉన్నవారికి నియంత్రణలో ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరోగ్యకర ఆహారం తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సమస్యలు అరుదుగా కనిపిస్తాయని వెల్లడించారు. పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వాపును తగ్గించే పదార్ధాలు ఉండటంతో సాధారణ శ్వాస సమస్యల నుంచి మనల్ని కాపాడతాయని అథ్యయనం తెలిపింది.

మాంసాహారం, తీపిపదార్ధాలు, సాల్ట్‌ అధికంగా ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే ఆస్త్మాను అదుపులో ఉంచడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల లోపల వాపు ద్వారా వచ్చే ఆస్త్మాను పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాల్లో ఉండే వాపును తగ్గించే పదార్ధాలు అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆరోగ్యకర ఆహారం తీసుకునే పురుషుల్లో ఆస్త్మా లక్షణాలు 30 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
 

మరిన్ని వార్తలు