జలుబు చేసిందా... పాప్‌కార్న్‌  తిని చూడండి! 

9 Dec, 2019 02:25 IST|Sakshi

పరి పరిశోధన

ఈసారి మీకు జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్‌ కోసమో మందులషాపుకు పరుగులు తీయకండి. ఆన్‌కౌంటర్‌ మెడిసిన్‌ కొని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.  ఈసారి జలుబు చేసినప్పుడు పాప్‌కార్న్‌ తిని చూడండి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుందనేది పెన్సిల్వేనియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ స్క్రాంటన్‌’కు చెందిన అధ్యయనవేత్తలు చెబుతున్న మాట.  పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వాళ్లు పేర్కొంటున్నారు.

మరో విషయం  ఏమిటంటే ఇలా పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే ఈ యాంటీఆక్సిడెంట్స్‌ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు అంటున్నారు. పనిలో పనిగా మరో జాగ్రత్త కూడా చెబుతున్నారు. ఇలా పాప్‌కార్న్‌ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఉప్పు వేయడం వల్ల పాప్‌కార్న్‌ వల్ల ఒనగూరే ప్రయోజనాలు తగ్గిపోతాయని, పైగా దేహానికి కూడా కొత్త సమస్యలు వస్తాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు