చార్లీ చాప్లిన్‌కు నోటీసులు!

19 Sep, 2015 00:49 IST|Sakshi
చార్లీ చాప్లిన్‌కు నోటీసులు!

ఆ  నేడు 19 సెప్టెంబర్, 1952
కరుణరస హాస్య చక్రవర్తిగా విశ్వవిఖ్యాతుడైన ఇంగ్లిష్ నటుడు చార్లీ చాప్లిన్ అమెరికాలో నివాసం ఉంటున్నప్పటికీ నలభై ఏళ్లుగా ఆయన బ్రిటిష్ పౌరసత్వంతో ఉన్నారు. అందుకే ఆయన బ్రిటన్ వెళ్లి వచ్చిన ప్రతిసారీ ఇమిగ్రేషన్ అధికారులకు తన రీ ఎంట్రీ పర్మిట్‌ను చూపించవలసి వచ్చేది. అప్పుడు మాత్రమే ఆయనకు ఆంక్షలు లేని పునఃప్రవేశం దొరికేది. అయితే 1952లో ఓసారి చార్లీ చాప్లిన్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఇంగ్లండ్ వెళుతున్నారు. ఆరు నెలలు బ్రిటన్‌లో ఉండి రావడానికి వారు ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు.

అయితే ఆ కుటుంబం అలా బయల్దేరగానే అమెరికన్ అటార్నీ జనరల్ థామస్ మెక్‌గ్రానరీ నుంచి చాప్లిన్‌కు సెప్టెంబరు 19న నోటీసులు జారీ అయ్యాయి. వాటి ప్రకారం ఆరునెలల వ్యవధి అయ్యాక అమెరికాలో ప్రవేశించేముందు చాప్లిన్ పర్మిట్‌ను మాత్రమే చూపిస్తే సరిపోదు. ఇమిగ్రేషన్ అధికారుల ‘హియరింగ్’కు కూడా హాజరవ్వాలి. అలాంటి ఆదేశం ఒకటి ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో ఆ నోటీసులో అటార్నీ జనరల్ ఎక్కడా పేర్కొనక పోవడం ఇప్పటికీ ఒక విశేషం.

మరిన్ని వార్తలు