ఆంగ్లభాషలోకి కొత్త సింబల్

19 Jul, 2013 12:46 IST|Sakshi
ఆంగ్లభాషలోకి కొత్త సింబల్
ఎవ్వరూ కనిపెట్టకపోతే భాష ఎలా పుడుతుందని ‘మాయాబజార్’ చిత్రంలో పింగళి అంటారు. పాండవులు అస్మదీయులు అని చెప్పి కౌరవులు అనగానే తసమదీయులు అంటారు లంబుజంబు. ఈ అసమ, తసమలు తెలుగుభాషలో లేకపోయినప్పటికీ అది భాషలో భాగంగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంగ్లిషు భాషలో 27 వ అక్షరం వచ్చి చేరబోతోంది.
 
ఇంగ్లిషులో అతి తరచుగా వాడే పదాలు... the, be, to, of, and. వీటిలో and పదానికి ఇప్పటికే ఒక సింబల్  ఉంది. The ని మాత్రం అలాగే వాడుతున్నాం. దాన్ని కూడా చిన్నదిగా వాడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన ఆస్ట్రేలియాలో 20 కి పైగా రెస్టారెంట్లు తెరిచిన మ్యాథిస్ పౌల్ మెదడులో మెదిలింది. The కి బదులుగా Th అక్షరాలను జత చేసి నల్లా ఆకారంలో  అనే అక్షరాన్ని డిజైన్ చేసి కీ విడుదల చేశాడు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ, ‘మిస్టర్ మిడాస్’ గా ప్రఖ్యాతి చెందిన పౌల్ ‘‘నేను ఈ అక్షరాన్ని ఆప్స్‌లో చేర్చమని ఆపిల్ కంపెనీని అడిగాను. అందుకు వారు నిరాకరించారు. వారి ఆలోచనను మార్చగలనన్న నమ్మకం నాకుంది’’ అని బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ‘‘ఈ మార్పు అవసరమా’’ అని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి మాత్రం ‘‘అవసరం లేదు. కాని ప్రజలందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం చెప్పగలను.
 
అతి ఎక్కువగా ఉపయోగించే and పదానికి ఇంగ్లిషులో ఇప్పటికే ఒక సింబల్ ఉండటం వల్ల ఆ పదాన్ని అతి తేలికగా వాడగలుగుతున్నాం. అదేవిధంగా  the కి కూడా ఉంటే ఆ అక్షరాన్ని తేలికగా రాయగలమా? లేదా? ఒక్కసారి ఆలోచించండి. నేను the అనే పదాన్ని మార్పు చేయట్లేదు. కేవలం అక్షరంగా మాత్రమే చేస్తున్నాను. ఈ సింబల్‌ని ఇప్పుడు వాడకపోతే కనుక 500 సంవత్సరాల తర్వాతైనా ఇలాంటి సింబల్ లేనందుకు ప్రజలు ఆశ్చర్యపడకపోరు’’ అన్నారు పౌల్.
 
మరిన్ని వార్తలు