పైసా ఖర్చు పెట్టలేదు... అయినా ప్రపంచమంతా తిరిగారు!

19 Dec, 2014 12:45 IST|Sakshi
పైసా ఖర్చు పెట్టలేదు... అయినా ప్రపంచమంతా తిరిగారు!

ప్రపంచం చుట్టేయాలని ఎవరికి మాత్రం ఉండదు? మిలన్, ఎలిమజ్ అనే మిత్రులు కూడా అచ్చం అలాగే అనుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే మాసంలో  ఈ ఇద్దరు బెర్లిన్‌లో కలుసుకున్నారు. వారి తొలి పరిచయమే గాఢ స్నేహంగా మారింది. ఇద్దరికీ పర్యటన అంటే ఎంతో ఇష్టం. అందుకే ‘‘ఇద్దరం కలిసి ప్రపంచమంతా పర్యటిద్దాం’’ అని బలంగా అనుకున్నారు. అనుకున్నంత మాత్రాన... అన్నీ జరగవు కదా! ఎందుకంటే  మిలన్, ఎలిమజ్‌లు సంపన్నులు కారు. అంతమాత్రాన వారేమీ నిరాశ పడి పోలేదు. ప్రయత్నించారు. కొన్ని  ట్రావెల్ కంపెనీలు  కొంత మొత్తం సహాయం చేయడానికి ఒప్పుకున్నాయి. అలా తొలి అడుగు పడింది.

ఒక దేశానికి  వెళ్లడం, ఆ దేశంలోని దాతల నుంచి సహాయం పొందడం...ఇలా  ఆస్ట్రియా, హంగేరి, రొమేనియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, పాకిస్థాన్, ఇండియా, అమెరికా, సింగపూర్... ఇలా ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో సంస్కృతులను దగ్గరి నుంచి చూస్తే అదృష్టానికి నోచుకున్నారు ఇద్దరు మిత్రులు. అదృష్టమేమిటంటే, ప్రతి దేశంలోనూ ఎవరో ఒకరు ఈ మిత్రులకు అతిథ్యం ఇచ్చారు. తమ ప్రయాణ అనుభవాలను ‘ది అప్టిమిస్టిక్ ట్రావెలర్’ పేరుతో ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకుంటున్నారు మిలిన్, ఎలిమజ్‌లు.
 

మరిన్ని వార్తలు