తేలికపాటి వ్యాయామంతోనూ మెదడుకు ఉత్తేజం

25 Sep, 2018 13:24 IST|Sakshi

లండన్‌ : వ్యాయామంతో మెదడులో కొత్త కణాలు ప్రేరేపితమవుతాయని పలు అథ్యయనాలు వెల్లడించగా, తాజాగా రోజుకు కేవలం పదినిమిషాల పాటు తేలికపాటి వ్యాయామంతోనూ త్వరతగతిన ఫలితాలు అందుతాయని తేలింది. కొద్దిపాటి వ్యాయామంతోనూ మెదడు సత్వరమే ఉత్తేజితమవుతుందని కాలిఫోర్నియా, జపాన్‌ పరిశోధకులు గుర్తించారు.

రోజుకు కేవలం పదినిమిషాల పాటు వ్యాయామం చేసినా మెదడులో జ్ఞాపకశక్తి సహా చురుకుదనం ప్రేరేపిస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. యోగా, థైచీ వంటి తేలికపాటి వ్యాయామాలతోనూ మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగం ఉత్తేజితమవుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జపాన్‌కు చెందిన సుకబా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

గతంలో వ్యాయామంతో మెదడుకు మేలు చేకూరుతుందని పలు అథ్యయనాలు వెల్లడించగా, తాజా అథ్యయనం వ్యాయామంతో మెదడుకు తక్షణ ఫలితాలు చేకూరుతాయని స్పష్టం చేసింది. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండవచ్చని పరిశోధకులు సూచించారు. 

మరిన్ని వార్తలు