రారండోయ్‌

24 Feb, 2020 04:17 IST|Sakshi

పట్నాయకుని వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్న వారం వారం తెలుగు హారం 100వ వారం వేడుక మార్చి 1న ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. నందమూరి లక్ష్మీపార్వతి, ఆర్‌.దిలీప్‌ రెడ్డి, కేవీ రమణాచారి, మామిడి హరికృష్ణ, వర్ధెళ్లి మురళి, ప్రభాకర రెడ్డి, ఎంవీ రామిరెడ్డి, గౌరీశంకర్, సన్నిధానం నరసింహశర్మ, కాలువ మల్లయ్య, పొట్లూరి హరికృష్ణ పాల్గొంటారు.

మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కా రాన్ని  ‘సీమేన్‌’ కథలకు గాను అద్దేపల్లి ప్రభుకు ఫిబ్రవరి 25 సా.6 గం.లకు రవీంద్ర భారతి మినీ హాల్‌లో ప్రదానం చేయనున్నారు. శీలా వీర్రాజు, కాలువ మల్లయ్య, నెల్లుట్ల రమాదేవి, నాళేశ్వరం శంకరం పాల్గొంటారు.

ధనికొండ హనుమంతరావు శతజయంతి ముగింపు సభ మార్చి 1న ఉ.10 – సా.5గం. వరకు రవీంద్రభారతి మినీ హాల్‌లో జరగనుంది. వకుళాభరణం రామకృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్, కె.శ్రీనివాస్, కాత్యాయని విద్మహే, జగన్నాథ శర్మపాల్గొంటారు. ధనికొండ ఎంపిక చేసిన 40 కథల మీద 25 మంది యువ రచయితలు మాట్లాడుతారు.

జాగృతి కథలు, నవలల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం మార్చి 1న ఉ. 10 గం.కు ఓయూ ప్రాంగణంలోని పీజీఆర్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆడిటోరియంలో జరగనుంది. వక్త: సిరివెన్నెల సీతారామశాస్త్రి. విజేతలు: కథలు– ఆర్‌.దమయంతి, కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, పాణ్యం దత్తశర్మ; నవలలు– పుట్టగంటి గోపీకృష్ణ, ఆకెళ్ల శివప్రసాద్‌.

సీఏఏ, రిజర్వేషన్లు, కాశీం, వరవరరావు, సాయిబాబా అరెస్టు, వారి కవిత్వం వంటి అంశాలపై మార్చి 1న మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గం. వరకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో సదస్సు జరగనుంది. నిర్వహణ: విప్లవ రచయితల సంఘం.

‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి సమగ్ర సాహిత్యం ప్రచురించే నిమిత్తం– అలభ్యంగా ఉన్న ఆయన రచనలు గురుక్షేత్ర సంగ్రామము, సంయుక్త, నేత్రావధాన చంద్రిక, మానసబోధ శతకము జాడ తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు అనిల్‌ అట్లూరి. ఫోన్‌: 8142642638. 

మరిన్ని వార్తలు