రోజుకో ఫొటో...

19 Jan, 2016 22:53 IST|Sakshi
రోజుకో ఫొటో...

ఇప్పుడంటే ఫొటో తీయడం చాలా సులువు. సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీల వర్షం కురిపించొచ్చు. కానీ ఇవేవీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో మాత్రం ఫొటో తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. సెల్ ఫోన్లు, సెల్ఫీ లేని రోజుల్లో జామీ లివింగ్ స్టన్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా రోజుకో ఫొటో తీసుకున్నాడు. ఈ పని ఆయన చనిపోయే రోజు వరకూ చేశాడు. ఇందుకోసం పాతకాలం నాటి పోలరాయిడ్ కెమెరా ఆయన ఉపయోగించాడు. న్యూయార్క్‌కి చెందిన ఈ ఫొటోగ్రాఫర్ తన ఫొటోలన్నిటినీ జాగత్తగా భద్రపరచి ఉంచుకున్నాడు.

బ్రెయిన్ ట్యూమర్‌తో ఈ మధ్యే జామీ చనిపోయాడు. అతని మిత్రులు హ్యూ క్రాఫోర్డ్, బెట్సీ రీడ్‌లు ఈ ఫొటోలన్నిటినీ ప్రదర్శనగా ఉంచారు. జామీ జీవితంలోని వివిధ ఘట్టాలను, మిత్రులతో, బంధువులతో గడిపిన క్షణాలను మరోసారి రీప్లే చేయించింది ఈ ప్రదర్శన.
 
 

మరిన్ని వార్తలు