మొహమాటాలకి పోతే ముప్పు తప్పదు!

3 Jul, 2015 23:05 IST|Sakshi
మొహమాటాలకి పోతే ముప్పు తప్పదు!

టారో బాణి
 
 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
 ఒక కొత్త ప్రేమ బంధం మీ కోసం ఎదురు చూస్తుంటుంది. పనిపరంగా ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. మీ స్వతంత్ర వైఖరి మీకు మొండివాళ్లని, అసమ్మతివాదులనీ పేరు తేవచ్చు. పని ప్రదేశంలో అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. అంద రితోనూ కలుపుగోలుగా, నిజాయితీగా ఉండండి. కలిసొచ్చే రంగు: పింక్
 
 టారస్(ఏప్రిల్ 21-మే 20)

 ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక స్త్రీ సహాయం లభిస్తుంది. చేతినిండా డబ్బు వస్తుంది. ఒక విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. రొటీన్ నుంచి బయట పడి, విశ్రాంతిగా గడపవలసిన తరుణమిది. హాయిగా పర్యటనలకు వెళ్లి, ప్రశాంతతను పొందండి. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
 జెమిని(మే 21-జూన్ 21)

 మీ ధోరణిని మార్చుకోవలసి వస్తుంది. మొదట్లో కొంచెం కష్టమైనా, అదే నెమ్మదిగా గాడిలో పడుతుంది. ఒక వ్యక్తిపట్ల మీరు ఆకర్షితులవుతారు. క్రమంగా అది ప్రేమకు దారి తీయవచ్చు.  దాని వల్ల మీ కుటుంబంలో కల్లోలం చెలరేగవచ్చు. మీ అహం శాంతిస్తుంది. తగిన సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు వస్తుంది. కలిసొచ్చే రంగు: వైట్

 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)

విజయం మీ తలుపు తడుతుంది. కొన్ని మార్పులు జరగవచ్చు. కష్టపడి పని చేసే మీ తత్వమే మీ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకోవలసిన తరుణమిది. ఆధ్యాత్మిక భావాలను అలవరచుకోవడం మంచిది. మనశ్శాంతి ఉంటే మీరు ఎన్ని విజయాలనైనా సొంతం చేసుకోవచ్చని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: బ్రౌన్
 
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
కలలలోకం నుంచి బయట పడి వాస్తవంలోకి వచ్చి, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ వారం మీకు అదృష్టకరంగా గడుస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లోటు ఉండదు. ప్రేమలో ఓటమి ఎదురు కావచ్చు. అనవసరంగా అహానికి పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. కలిసొచ్చే రంగు: గోల్డెన్ ఎల్లో

 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఒక దాని మీద గట్టిగా నిలబడాలని తెలుసుకోండి. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ, నిజం. అలా చేస్తే గానీ ప్రయోజనం ఉండదు. మీ కలలు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఎదుటివారు చెప్పే సలహాలు మీ మంచికోసమేనని తెలుసుకుని, ఓపిగ్గా వినడం అలవాటు చేసుకోండి. కలిసొచ్చే రంగు: వైట్
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీ ప్రేమ, వ్యక్తిగత జీవనం మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. ముందు పెళ్లి చేసుకోవాలా లేక ఇల్లు కొనుక్కోవాలా? ఏది ముందు? ఏది వెనకో తెలియక కొంచెం తికమక పడతారు. ఆహారం విషయంలో కఠోరంగా వ్యవహరించక తప్పదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం కోసం అనివార్యంగా ఎక్సర్‌సైజులు చేయండి. కలిసొచ్చే రంగు: లైట్ బ్లూ
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
జీవితంలో సంభవించనున్న కొత్త మార్పులు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తవచ్చు. పెద్దమొత్తంలో డబ్బు చేతికందుతుంది. మీ కలల్ని నమ్ముకోండి. అవి సాకారం కానున్నాయి. మీ సామర్థ్యాన్ని నిరుపించుకునేందుకు గట్టిగా కృషి చేయవలసి వస్తుంది. ప్రేమ విషయంలో కొన్ని చిక్కుముళ్లు, మెలికలు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: నలుపు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
మీరు చదవనున్న ఒక ఆధ్యాత్మిక గ్రంథం మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకు వెళ్తుంది. మీరు సరైన మార్గంలోనే వెళ్తున్నారు. మీరు కోరుకుంటున్నట్లుగా శాంతియుతంగానే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఇంట్లో, ఆఫీసులో మరమ్మతులు చేయించవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: వయొలెట్

క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
మీ పని సామర్థ్య పెరుగుతుంది. దానిమూలంగా మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. బంధాలు, బంధుత్వాల విషయంలో చోటు చేసుకోనున్న కొత్తమార్పులు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయి. జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను కలవండి. కలిసొచ్చే రంగు: పీచ్
 
అక్వేరియస్  (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఈ వారం ఒత్తిడి, టెన్షన్లు తప్పవు. గుండె ఆరోగ్యం విషయంలో మరింత ఆందోళన పడతారు. మనసులో ఉన్న బాధను అణుచుకోవద్దు. ఆర్థికంగా మెరుగ్గానే ఉంటుంది. దూసుకుపోయే మీ స్వభావం మీకు మంచే చేస్తుంది. విందు వినోదాల్లో పడి ఆహారం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే డాక్టర్‌ను కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: కాఫీ బ్రౌన్
 

 పైసిన్ (ఫిబ్రవరి20-మార్చి20)

అన్ని కష్టాలనూ, అననుకూలతలనూ అధిగమించి, కాస్త స్థిమితపడతారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పనిలో మరింత చొరవ చూపి అధికారుల మన్ననలందుకుంటారు. మీ పరిశోధనలను, అధ్యయనాన్ని కొనసాగించండి. చిన్న చిన్న రుగ్మతలని, నొప్పులను నిర్లక్ష్యం చేస్తే పెద్ధ ఫలితాన్ని చవి చూడవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్

ఇన్సియా కె.
 టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
సౌర వాణి

మీకు మీరుగా తీసుకున్న నిర్ణయం మంచిదే. మళ్లీ దాన్ని అనవసర చర్చల్లో పెట్టి మనసుని ఆందోళన పరచుకోకండి. నిర్ణయాన్ని మార్చుకోవాలని భావించకండి. కుటుంబ సభ్యులకి- తగినంత గుంభన ఉండాలనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. విదేశీ ప్రయాణానికి సంసిద్ధంగా ఉండటం మంచిది. అప్పు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

నమ్మి మోసపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి, ఎంతవరకూ నమ్మాలో అంతకు మించి పోవద్దు. ముఖ్యంగా వైద్యసూచనలూ సలహాలూ చికిత్స విషయాల్లో ఇద్దరు ముగ్గురి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లండి. కీర్తికండూతి కోసం పాకులాడవద్దు. ఇతరులతో పోలిక వద్దేవద్దు. మీరూ మీ కుటుంబ సభ్యులూ ఒకే మాట మీద ఉండండి.

ఎప్పటికప్పుడు ఏదో ఒక పని అత్యవసరంగా నెత్తిన పడుతూ అనుకున్న పని లేదా పనులు వాయిదా పడుతూ ఉండవచ్చు. దీన్ని అసమర్థతగా భావించక, ఈ మాత్రమైనా పనులు జరుగుతున్నాయని సంతోషించండి. శారీరకమైన అలసట కారణంగా ఈ వారం ఔషధ సేవ అవసరపడచ్చు. తేలికపాటి ఆరోగ్యపరీక్ష చేసుకుని ముందు జాగ్రత్తతో ఉండండి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఓ విషయం ఆందోళన కలిగించవచ్చు. దాని గురించి మరింతగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని విరోధించే వ్యక్తులతో ముభావంగానే ఉండండి. వారి సహాయం కోసం చూడద్దు. మీకు మీరుగా చాడీలని వ్యాప్తి చేస్తే ఇబ్బందులు తప్పవు.

మీరు ప్రయత్నించిన తీరుగా కార్యక్రమాలు ముందుకు సాగవు. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవలసి వచ్చినప్పుడు మొహమాటాలకు, భరోసాలకు పోవద్దు. ఆడంబరం కోసం అనవసరమైన వస్తువులు కొని విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. వారాంతంలో శుభవార్తని వింటారు. రుణాలని తీర్చే ప్రయత్నంలో ఉండండి.

బంధుమిత్రులతో విందువినోదాల్లో ఆనందంగా గడుపుతారు. గృహాన్ని గానీ, భూమిని గానీ తాకట్టుపెట్టుకోవడం మాని కొనుక్కోవడానికే ప్రయత్నిస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. దైవకార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మికంగా గురువుని అతిగా విశ్వసించవద్దు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకుంటూ వెళ్లకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులు కావచ్చు.

ఎవరిని సంతృప్తి పరచడం కోసమో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తే మొహమాటం లేకుండా రానని చెప్పండి. కుటుంబ సభ్యుల కంటే బంధుమిత్రులు ఎక్కువ కారని గ్రహించండి. పిల్లల విద్యాసంస్కారాలని తప్పక పట్టించుకోవాలి. ప్రవర్తన విషయంలో మెలకువతో ఉండండి. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉండవచ్చు.

ప్రతిపనిలోనూ జాప్యం అవుతూ ఉండవచ్చు. కోర్టు వివాదాలు మరింత జాప్యమౌతూ అనిశ్చిత స్థితిలో పడేయవచ్చు. ఎవరిని సలహా సూచనలడిగినా మరింత అయోమయంలోకి నెట్టవచ్చు. దేనికైనా ఓ ప్రణాళిక అవసరమనే ఆలోచనతో ఉండండి. రావలసిన బకాయిలకోసం ప్రయత్నించండి. మానసికంగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు దైవధ్యానానికి ప్రాముఖ్యమీయండి.

ప్రారంభించిన పనులన్నీ ఆటంకాలకి గురై మధ్యలో ఆగిపోవడంగాని పూర్తిగా విరమించుకోవడం గాని జరగవచ్చు. ఇదే ఫలితం ప్రయాణాల విషయంలోనూ వర్తించవచ్చు. బంధుమిత్ర శ్రేయోభిలాషులు మాట ఇచ్చారు కదా అని అతి విశ్వాసంతో ఉండవద్దు. ప్రయత్నలోపం వద్దు. రుణాలని తెచ్చుకోవద్దు, ఇవ్వవద్దు.

ఇతరులు మీ కుటుంబాన్ని గురించి వాదోపవాదాలు చేసే అవకాశాన్ని ఈయకండి. గుంభన పాటించండి. పెద్దల సూచనలను స్వీకరించండి. అనుకున్న పనులు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలసించకుండా ప్రయత్నాలు చేయండి. ఆదాయం అంతంత మాత్రం కాబట్టి వ్యయ నియంత్రణని పాటించండి. తలిదండ్రులకి ఆరోగ్యపరీక్షలవసరం.

ఎప్పుడో చేసిన వాగ్దానం ఇరుకున పడేయవచ్చు. ఎవరికో ఇచ్చిన హామీ మీకు సమస్యగా పరిణమించవచ్చు. ఎవరి విషయంలోనో మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ పని మీకు కంఠం పట్టుకోవచ్చు. మొగమాటం లేకుండా మాట్లాడండి తప్ప విషయాన్ని సాగదీయకండి. నేరాన్ని తలమీదికి తెచ్చుకునే విధంగా తప్పించుకోవడం, మెత్తగా ఉండడం సరి కాదని గ్రహించండి.

సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.  సంతానపు చదువు విషయంలో తగినంత శ్రద్ధని చూపండి. నిజమైన ఆస్తి సంతానమే అనే విషయాన్ని గమనించి స్థిరచరాస్తుల మీద కాకుండా వీరి విద్య ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. అత్తమామలతో సత్సంబంధాలుండటం అవసరం. మరిది వదినెలతో తగుదూరాన్ని పాటించండి.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 

మరిన్ని వార్తలు