బ్యూటిఫుల్‌ ఫేస్‌కి... బ్యూటీ ప్యాక్‌!!

7 May, 2018 00:53 IST|Sakshi

ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే చేసుకో వచ్చు. చర్మతత్వాన్ని బట్టి ప్యాక్‌ తయారు చేసుకోవాలి. పొడి చర్మానికి జిడ్డును తొలగించే పదార్థాలు వాడకూడదు. ఆమ్లగుణాలున్న పదార్థాలు చర్మం మీద ఉండే నూనెలను తొలగిస్తాయి. కాబట్టి వాటిని ఆయిలీ స్కిన్‌కు మాత్రమే ఉపయోగించాలి. పొడిచర్మానికి పాలు, మీగడ వాడాలి.

ఓట్‌మీల్‌ ప్యాక్‌...
ఓట్‌మీల్‌ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటినీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి లేదా గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిబారి పగుళ్లు బారుతున్న చర్మానికి మంచి పోషణ.

చర్మం నెర్రలు బారి మంటపెడుతున్నప్పుడు ఈ ప్యాక్‌ వేస్తే చర్మం మృదువుగా మారుతుంది.ఈ ప్యాక్‌ పురుగుకాట్లు వంటి గాయాలకు కూడా రాయవచ్చు. ఓట్‌మీల్‌ను ఒకటి– రెండు కప్పులు పొడి చేసుకుని రోజూ కావలసిన మేరకు నీటితో కలుపుకుని వాడుకోవచ్చు.

మరిన్ని వార్తలు