ఫేక్‌ వార్తలకు ర్యాంకులిచ్చేయవచ్చు...

23 Jan, 2018 01:25 IST|Sakshi

ఫేస్‌బుక్‌లో తప్పుడు వార్తలు ఎక్కువయ్యాయని ఇబ్బంది పడుతున్నారా? వాస్తవమేమిటో... అబద్ధమేమిటో తెలియని స్థితిలో పడిపోయారా? ఈ చిక్కు సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీకు నమ్మకమైన వార్తలు ఎవరు అందిస్తారో మీరే చెప్పాలంటూ ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ వినియోగదారులనే కోరనుంది. ఫేస్‌బుక్‌లో ఉన్న దాదాపు 200 కోట్ల మంది గుర్తించడం మొదలుపెడితే తప్పుడు వార్తలు, సమాచారాన్ని గుర్తించడం చాలా తేలిక అవుతుందని.. తద్వారా అలాంటి సమాచారాన్ని తీసేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఫేస్‌బుక్‌ అంటోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలుకొని అనేక ఇతర అంశాల విషయంలో ఫేస్‌బుక్‌ తప్పుడు వార్తల వ్యాప్తికి ఉపయోగపడిందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బెర్గ్‌.. ఈ అవ్యవహారాలకు చెక్‌ పెట్టడం ఈ కొత్త సంవత్సరంలో తాను తీసుకున్న నిర్ణయమని ఆయన ఈమధ్యే ప్రకటించారు కూడా. అన్నీ సవ్యంగా సాగితే ఈ వారంలోనే ‘విశ్వసనీయ వర్గాలు’ అన్న ఆప్షన్‌ ఫేస్‌బుక్‌లో కనిపించడం మొదలుకావచ్చు. చూద్దాం ఏమవుతుందో!  

మరిన్ని వార్తలు