లంగాఓణీలది గ్రాండ్ ఇమేజ్...

20 Jul, 2013 05:02 IST|Sakshi
లంగాఓణీలది గ్రాండ్ ఇమేజ్...
సన్నగా ఉండే అమ్మాయిలు కూడాసౌందర్యభారంతో తూలిపడుతున్నారంటే...
 నో డౌట్ - 
 వాళ్లు లంగా ఓణీ వేసుకుని ఉండాలి!
 సడన్‌గా అబ్బాయిలు
 భక్తిశ్రద్ధలతో లెంపలేసుకున్నారంటే...
 నో డౌట్ - 
 లంగా ఓణీలో ఉన్న దేవకన్యల్ని చూసి వుండాలి!
 సాయంత్రపు వేడుకల ‘పట్టు’ప్రౌఢిమలు
 అంతా ఒకేసారి తలతిప్పి చూశారంటే...
 నో డౌట్ - 
 లంగాఓణీకి ఘనస్వాగతమేదో లభించి వుండాలి!
 లంగాఓణీలది గ్రాండ్ ఇమేజ్...
 ఎట్రాక్షన్‌కి, అడ్మిరేషన్‌కి, అటెన్షన్‌కీ...
 బ్రాండ్ ఇమేజ్. 
 
 1- పింక్ వెల్వెట్ లెహంగాకి, క్రీమ్ కలర్ బీజ్ ఓణీ కాంబినేషన్ కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.
 
 2- ముదురు నీలం రంగు నెటెడ్‌కి సిల్వర్ కలర్ వర్క్, మల్టీ కలర్ బార్డర్ వల్ల లెహంగా అందం కళ్లను కట్టిపడేస్తోంది. దీనికి పింక్, బ్లూ కలర్‌లలో డిజైన్ చేసిన పచ్చని షిఫాన్ ఓణీ జత చేయడంతో లంగా అందం రెట్టింపు అయ్యింది.
 
 3- బ్లాక్ బెనారస్, నెటెడ్ మెటీరియల్, సీక్వెన్స్ వర్క్‌తో డిజైన్ చేసిన లెహంగా పైన పింక్ షిఫాన్ ఓణీ వేయడంతో ఆకర్షణీయంగా మారింది.
 
 4- ఎరుపు రంగు నెటెడ్ లెహంగాకి ఇన్నర్‌గా బెనారస్ లైనింగ్ వాడటంతో సెల్ఫ్ డిజైన్‌లా కనువిందుచేస్తోంది. ఈ లెహంగాపైన ముదురు నీలంరంగు కట్‌వర్క్ బార్డర్ ఓణీ ధరిస్తే వేడుకలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
 
 డిజైనర్: శశి ముగ్ధ ఆర్‌‌ట స్టూడియో
 
మరిన్ని వార్తలు