వృషభం ఎక్కడికి పోతుంది?

2 Jul, 2018 01:38 IST|Sakshi

సాహిత్య మరమరాలు

హరికథా పితామహుడిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసు ఇంట్లో ఉన్నప్పుడు గోచీ మాత్రమే కట్టుకునేవారు. బయటికి వెళ్తే మాత్రం పట్టు వస్త్రాలు ధరించేవారు. గంధపు పూత, కొప్పుకు పూదండ, ఆభరణాలు, హారాలు... చాలా దర్జాగా ఉండేది వ్యవహారం. ఆ వేషధారణలో ఓసారి విజయనగరం ఆస్థానానికి వెళ్లారు. అసలే మనిషి ఎత్తు. ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉండేవారు. దానికి తగిన లావు. ఈ ఆహార్యాన్ని చూసి, సంస్థానాధీశుడు శ్లేషగా, ‘కవి వృషభులు ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు’ అని పలకరించాడు. కవి కేసరి, కవి కోకిల లాంటి బిరుదులు ఇవ్వడం మన సాంప్రదాయమే. ఆ కోవలో కవి వృషభులు అనడం ఆదిభట్లను గౌరవించడమూ అదే సమయంలో వృషభంలా ఉన్నావు అని వెక్కిరించడమూ కూడా. మరి ఆదిభట్ల తక్కువవాడా?  రాజు అంటే అన్నీ ఇచ్చేవాడు కదా! ఆ అర్థం వచ్చేట్టుగానూ మరో భావం స్ఫురించేట్టుగానూ చమత్కారంగా ఇలా జవాబిచ్చారు.  ‘ఇంకెక్కడికి ప్రభూ, కామధేనువు లాంటి మీ దగ్గరికే’.

మరిన్ని వార్తలు