ఆ ప్రొటిన్‌తో  కొవ్వు ఖాళీ!

2 Nov, 2018 00:27 IST|Sakshi

ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఓ శుభవార్త. సహజసిద్ధమైన ప్రొటిన్‌ సాయంతోనే శరీరంలోని కొవ్వులను మూడొంతుల వరకూ తగ్గించవచ్చునని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించడం దీనికి కారణం. ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో బీపీ3 అని పిలిచే ఈ ప్రొటిన్‌ కేవలం 18 రోజుల్లో కొవ్వులను కరిగించినట్లు తెలిసింది. కొవ్వులను తగ్గించడంతోపాటు జీవక్రియలకు సంబంధించిన ఇతర జబ్బులకూ సహజసిద్ధమైన ప్రొటీన్‌ ద్వారా మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా.

బీపీ3 సహజమైన ప్రొటిన్‌ కావడం వల్ల దీనిపై నేరుగా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశముందని, తద్వారా ఈ ప్రొటిన్‌ ఆధారిత మందు వేగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆంటన్‌ వెల్‌స్టీన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూండగా తమకు ఈ ప్రొటీన్‌ కొవ్వులను కరిగించేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని ఆయన చెప్పారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపాన్ని బాగు చేయనా?

చర్మంపై ముడతలు పోవాలంటే..

రాముడు–భీముడు.. గంగ–మంగ

బాదం.. ఆరోగ్యవేదం!

గ్యాస్‌ ట్రబుల్‌ మందులతో కిడ్నీకి చేటు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి