పీచు, బ్యాక్టీరియాలతో? గుండెకు మేలు

3 Jan, 2019 00:26 IST|Sakshi

పరి పరిశోధన 

మన పేవుల్లోని బ్యాక్టీరియా పుట్టించే.. కొన్ని రకాల పీచుపదార్థాల్లో ఉండే రసాయనం ఒకటి అధిక రక్తపోటుతోపాటు గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా నిరోధిస్తుందని జర్మనీలోని ఓ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ప్రొపయోనైట్‌ అనే రసాయనం రోగ నిరోధక వ్యవస్థ కణాలను శాంత పరచడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుందని తాము గుర్తించినట్లు మాక్స్‌ డెల్బర్‌ తెలిపారు. మన కడుపు/పేవుల్లో ఉండే బ్యాక్టీరియా ఆహారం నుంచి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని ఆయన వివరించారు.

అధిక రక్తపోటు ఉన్న ఎలుకలకు ప్రొపయోనైట్‌ను అందించినప్పుడు గుండెకొట్టుకునే వేగంలో మార్పులు (అరిథ్రిమియా) ప్రమాదం గణనీయంగా తగ్గిందని నాడులకు జరిగే నష్టమూ తక్కువని చెప్పారు. అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారికి ప్రొపయోనైట్‌ను అందించడం ఒక కొత్త చికిత్స పద్ధతి కావచ్చునని సూచించారు. ప్రొపయోనైట్‌ కారణంగానే గుండెజబ్బుల నివారణకు పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొవాలని సూచిస్తారని వీటిల్లో పండ్లు, కాయగూరల్లో ఉండే ఇన్సులిన్‌ పీచు పదార్థాలను ఉపయోగించుకుని పేవుల్లోని బ్యాక్టీరియా ప్రొపయోనైట్‌ను ఉత్పత్తి చేస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు